30, డిసెంబర్ 2012, ఆదివారం

భౌద్ధ స్తూపం



              ఘంటసాల  భౌద్ధ స్తూపం                         
                        ఈ స్తూపం ఘంటసాలకు ఈశాన్య భాగాన ఉంది.వాడుక భాషలో మనందరికి తెలిసిన దీని పేరు లంజదిబ్బ.కాని అతి పవిత్రమైన ఈ స్తూపాన్ని అలా పిలవటం సరికాదు.1870లో మొదటిసారిగా ఈ స్తూపం వెలుగులోకి వచ్చింది.అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.ఆ తరువాత 1906 లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.ఈ స్తూపమువంటిది దక్షిణభారత దేశం లోనే లేదని ప్రకటించాడు.ఘంటసాల ఒకప్పటి భౌద్ధ క్షేత్రమని ప్రపంచానికి తెలియ చేసింది ఆయనే.ఘంటసాలలో మొత్తం ఇలాంటివి అయిదు స్తూపాలున్నాయి.దక్షిణం వైపు ఉన్న కోటదిబ్బ,పశ్చిమాన ఉన్న ఎర్రంపాళ్ల దిబ్బ,మాలపల్లె లోని గొర్రెపందాల దిబ్బ,ఉర్లోనే ఉన్న కోడిపందాల దిబ్బ.స్తూపం అనగా సంస్కృత శబ్ధం దీని అర్ధం దిబ్బ.
                                          మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరం లో మహదేవుడనే భౌద్ధ భిక్షువు ను దేశంలోని వివిధప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటసాల,నాగార్జునకొండ,అమరావతి లలో నిక్షిప్తం చేశాడని 'దివ్య వాదన 'అనే గ్రంధం లో వివరించబడింది.ప్రస్తుతం ఘంటసాల లో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ,అమరావతి ల లో లేదు.అదీ కాక మన స్తూపం  70శాతం యధాతధంగా ఉంది.మిగతా స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు .భౌద్ధ మతస్తులు తమ మత స్తూపాలను,సంఘారామములను,సహజ సుందర ప్రదేశములలోనూ విస్తార జలసంపదలున్న ప్రాంతాలలోనూ నిర్మించారు .బుద్ధభగవానుడు సకల భోగాలతో జీవనం సాగించే సమయం లో మానవ జీవితంలో దుఖ నివారణకి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం లో అర్ధరాత్రి వేళ భార్యాపిల్లలను, రాజ్యాన్ని విడిచి ఒక అశ్వము పై ఎక్కి వెళ్ళిపోతాడు.బుద్ధునికి ప్రియమైన ఆ అశ్వము పేరు కంటకము.ఆ కంటకము పేరిట నిర్మించబడిన మన గ్రామము కంటకశైల గా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటసాల గా నామాంతరం చెంది ఉండవచ్చు.ఇక స్తూపం అంటే భౌద్ధం లో చైత్యం అని అర్ధం.అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు కాబట్టి ఘంటసాల మహాచైత్యం.అనేక భౌద్ధ శిల్పాలు,పూసలు,రోమను నాణాలు,పాలరాతి స్తంభాలు ఈ స్తూపము సమీపం లో దొరికాయి.
ఘంటసాల పురాతన రేవు అని చెప్పటానికి ఆధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి 13వ శతాబ్ధం వరకు ఘంటసాల ఓడరేవు గా గుర్తించబడింది.ఈ ఓడరేవు నుంచి పాశ్చ్యాత్య దేశాలకు వ్యాపారులు తరలి వెళ్ళేవారు.ఆ రోజుల్లో రోమను నాణాలు చెలామణి లో ఉండేవి.ఈ స్తూపము దగ్గర జరిపిన తవ్వకాలలో రోమను చక్రవర్తి బొమ్మ ఒకవైపు,సముద్రుడి బొమ్మ ఒక వైపు ఉన్న నాణేలు దొరికాయి.
ప్రస్తుతం జలధీశ్వరాలయం లో మనం పూజిస్తున్న మహానాగము ఇక్కడ దొరికినదే.ఆ తరువాత దానికి సిమెంట్ చేయించి సుబ్బారాయుడి గుడి వెనుక ప్రతిష్టించారు.విచిత్రమైన విషయం ఏమిటంటే భౌద్ధమత సిద్ధాంతం ప్రకారం విగ్రహారాధన చెయ్యరాదు.కాని ఆయన శిష్యులు భౌద్ధమత వ్యాప్తి కొరకు స్తూపములు నిర్మించి ప్రచారం చేసేవారు








అమృత పలుకులు

"ధమ్మపదంలో"
ధమ్మపదం ఆధారంగా
బుద్ధ మహాత్ముడు చెప్పిన కొన్ని అమృత పలుకులు:
  • "అభిత్థరేథ కల్యాణే,""అభిత్వరేత కల్యాణే" (సంస్కృతం)"మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి."
  • “ఆరోగ్య పరమా లాభః, సన్తుష్టిః  పరమం ధనం విస్సాస పరమా జజ్ఞాతిః, నిబ్బానం పరమం సుఖ- "ఆరోగ్య పరమా లాభామ్ సంతుట్ఠీ పరమం ధనమ్
    విశ్వాస పరమో జ్ఞాతిః సన్తుష్టిః పరమం సుఖమ్"(సంస్కృతం)
    "ఆరోగ్యమే పరమ లాభం; సంతుష్టత అనేదే పరమ ధనం;
    విశ్వాసమే పరమ బంధువు; నిర్వాణమే పరమ సుఖం"
  • "సుఖా మత్తెయ్యతా లోకే, అథోపెత్తెయ్యతా సుఖా
    సుఖా సామజ్ఞతా లోకే, అథో బ్రమ్హతా సుఖా"
    -
    "సుఖా మాత్రీయతా లోకేథ పిత్రీయతా సుఖా 
    సుఖా శ్రమణతా లోకేథ బ్రాహ్మణతా సుఖా" (సంస్కృతం)"ఈ లోకంలో మాతృత్వం ధన్యం; పితృత్వం కూడా ధన్యమే.
    శ్రమణత్వం ధన్యం; బ్రాహ్మణ్యం ధన్యం"
  • "అప్పమత్తోహి ఝాయన్తో, పప్పోతి విపులం సుఖం""అప్రమత్తో హి ధ్యాయాన్, ప్రాప్నోతి విపులం సుఖమ్" (సంస్కృతం)"అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు"
  • "అప్పమాదో అమతపదం, పమాదో మచ్చునోపదం""అప్రమాదో అమృతపదం, ప్రమాదో మృత్యోఃపదమ్" (సంస్కృతం)"అప్రమత్తతే అమృతత్త్వం; ప్రమత్తతే మృత్యువుతో సమానం"

బుద్ధుని మధ్యమ సంభాషణలు

సంభాషణల్ని ఒక రచనా ప్రక్రియగా ఆరంభించినది ప్రపంచంలో బుద్ధుడేనేమో. ప్లేటో రాసిన 'డయలాగ్స్', నాగసేనుడు, మీనాండర్ మధ్య జరిగిన 'మిళిందపంహ' ఆ తరువాతివే. గతంలో బుద్ధుని దీర్ఘ సంభాషణల్ని తెలుగు చేసిన అన్నపరెడ్డి బుద్ధఘోషుడు ఇటీవల బుద్ధుని 'మజ్జిమ నికాయ'ను 'బుద్ధుని మధ్యమ సంభాషణలు'గా తెలుగు చేశారు. ఈ రకంగా పాళీ నుండి తెలుగు చేసిన వారిలో అన్నపరెడ్డిగారే మొదటి వారయ్యారు. బుద్ధుని సంభాషణల్ని ప్రత్యక్షంగా మనం వింటున్నట్లుగా సాగుతూ ఒక లిటరరీ బ్యూటీని అందించిన పుస్తకమిది. చదువుతున్నకొద్దీ వినబుద్ధి కలిగించే గుణం అనువాదంలో చోటు చేసుకుంది.

మానవుణ్ణి దుఃఖం నుండి విముక్తుణ్ణి చేయడానికి బుద్ధుడు చేసిన తాత్విక, తార్కిక సంభాషణల సంపుటే ఈ పుస్తకం. ఉదాహరణకు 'సర్వాసవ సూత్తం'లో అంటే అన్ని ఆసవాల (కాలుష్యాల) గురించిన సూత్రంలో ఎటువంటి మనిషిని కాలుష్యాలు అంటుతాయి? ఎవరిని అంటవు? వాటిని వదిలించుకోవడమెలా? అన్న అంశాల గురించి చర్చ ఉంది. జ్ఞానంతో కూడిన అవధానం (wise attention), అజ్ఞానంతో కూడిన అవధానం (unwise attentiong) అనే రెండింటితో మనిషి సంచరిస్తూ ఉంటాడని, ఒకడు అజ్ఞానంతో కూడిన అవధానంలో ఉన్నట్లయితే అతనిలో అంతకుముందే ఉన్న కాలుష్యాలకు మరికొన్ని చేరుతాయి అని చెప్పబడింది. ఈ కాలుష్యాల్ని చూడడం ద్వారా, భరించడం ద్వారా, పరిత్యజించడం ద్వారా, భావన చేయడం ద్వారా వదిలివేయాల్సి ఉంటుందని చెబుతాడు బుద్ధుడు. ఒక భిక్షు ఈ రకంగా చేసినపుడు అతడు 'సర్వాసవని గ్రహభిక్షు'గా మారతాడు. తృష్ణను, బంధనాలను తెంచుకుని, గర్వాన్ని అంతమొందించుకోవడంతో అతడు దుఃఖానికి అంతం పలుకుతాడు.

ఈ రకంగా కళంకాలు, శిక్షణ, క్షాళన ప్రక్రియ, సమ్యగ్దృష్టి, నిర్వాణ సాక్షాత్కారం, ధ్యానం, జ్ఞానోదయం వంటి యాభై అంశాల గురించి ఉపమానాలతో కూడిన కథల ద్వారా సాగిన సంభాషణలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. బుద్ధుని మధ్యమ సంభాషణలు బౌద్ధాభిమానులకే కాక, సత్యాన్వేషకులందరికీ అందుబాటులోకి రావడంలో అనువాదకుని కృషి ఎంతో గుర్తించదగింది.
- కాకుమాని శ్రీనివాసరావు

బుద్ధుని మధ్యమ సంభాషణలు,

అనువాదం : అన్నపరెడ్డి బుద్ధఘోషుడు
పేజీలు : 351, వెల : రూ. 200/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు


బౌద్ధ టూరిజానికి బెస్ట్ గైడ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో చోట్ల ఒక నాటి బౌద్ధ వైభవాన్ని సూచించే చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని తెలుసు. కాని ఎక్కడెక్కడున్నాయో చెప్పమంటే మాత్రం అమరావతి, నాగార్జున కొండ, మరో రెండు మూడు పేర్లు చెప్పి ఊరుకుంటాం. అంతకు మించి చెప్పలేం. 'ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం' పేరుతో ఒక పరిశోధన గ్రంథాన్ని రాశారు పిల్లి రాంబాబు. వేల ఏళ్లనాటి బౌద్ధ వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలను, ప్రదేశాలను స్వయంగా సందర్శించి, ఆయా ప్రదేశాల గురించిన ఎంతో సమాచారాన్ని సేకరించి రాసిన పుస్తకమిది. కేవలం బౌద్ధం కోసమే కాకుండా మన రాష్ట్ర చరిత్రపై ఆసక్తి ఉన్నవాళ్లంతా చదవాల్సిన పుస్తకమిది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల మ్యాప్‌లు ఇచ్చి వాటిలో ఎక్కడెక్కడ బౌద్ధ క్షేత్రాలున్నాయో వివరిస్తూ ప్రచురించిన పుస్తకం బహుశా ఇదొక్కటేనేమో. జిల్లాలలోని ఏ మారుమూల గ్రామంలో ఏ బౌద్ధ క్షేత్రమున్నదో కూడా వివరించారు గ్రంథకర్త.

బౌద్ధం గురించిన పరిశోధనతో పాటు ఆ మత పరిచయం కూడా ఉంటుందీ గ్రంథంలో. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో బౌద్ధ యుగం గురించి వివరిస్తూ, బౌద్ధ ధర్మ విశిష్టతను పేర్కొంటూ బౌద్ధానికి సాహిత్యం తోటి, కళలతోటి, భాషతోటి ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. బౌద్ధ తాత్వికులను పరిచయం చేస్తూ బౌద్ధ ఉత్థాన పతనాలను పేర్కొంటూ ముగిస్తారు రాంబాబు. ఈ ఆల్ ఇన్ వన్ గైడ్‌లో భాష కూడా సరళంగా ఉంది. బౌద్ధం మీద విస్తృత పరిశోధనలు చేసిన అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముందుమాటలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధం గురించి సమగ్రంగా చర్చిస్తూ తెలుగులో వచ్చిన గ్రంథమిది.

ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం, పి. రాంబాబు
పేజీలు : 478, వెల : రూ. 300/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు

వినయ పిటకము
బౌద్ధ ధర్మానికి మూల గ్రంథాలు సుత్త పిటకము, వినయపిటకము, అభిదమ్మపిటకము. వీటినే త్రిపీటకాలు అని పిలుస్తారు. వాటిలో రెండోదైన వినయపిటకము బౌద్ధ భిక్షువులు పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించినది. మిగతా రెంటిలో ఏదీ సమగ్రంగా తెలుగులోకి అనువందింపబడలేదు. ఈ గ్రంథం ప్రధానంగా బౌద్ధ భిక్షువుల కోసం ఉద్దేశించినదే ఐనా ఆ కాలం నాటి ప్రజాతంత్ర వ్యవస్థ, వేషభాషలు, ఆహారపుటలవాట్లు, వైద్య విధానము లాంటి మరెన్నో విషయాల గురించి కూడా చాలా సమాచారాన్ని ఇస్తుందీ గ్రంథం. అనువాదం కాస్త పాత కాలపు భాషలో ఉంది కాబట్టి ఓపిగ్గా చదవగలిగినపుడు మాత్రమే ఆ భాషకి అలవాటు పడగలం.

ధమ్మపదం
బుద్ధుడు తాను నమ్మిన ధర్మాన్ని ప్రబోధిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరికి బోధించిన విషయాలే ఈ ధమ్మపదం. సుత్త పిటకంలో ఒక భాగమిది. 26 'వర్గాలు'గా విభజించిన ధమ్మపదంలో మొత్తం 423 శ్లోకాలు, వాటి తాత్పర్యాలూ ఉన్నాయి. బుద్ధుడు తన జీవితంలో బోధించిన విషయాల సంక్షిప్త రూపమే ఈ పుస్తకం.
వినయపిటకము, పేజీలు : 530, వెల : రూ. 300/-
ధమ్మపదం,
పేజీలు : 82, వెల : రూ. 30/-,
అనువాదం : మోక్షానందస్వామి,
ప్రతులకు : మోక్షానందాశ్రమము, తిమ్మాపూర్,
నిజామాబాద్ జిల్లా

ధమ్మపదం

ధమ్మపదం(తెలుగు)


ధమ్మపదం ( పాలీమూలం)
సంస్కృతాంధ్రానువాదములతో

‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే రచన సులభ సాధ్యం కాదు. పాండితీ ప్రకర్షకు, రచనా సామర్థ్యానికీ నికషాయమానమైన ఈ గ్రంథం ఇప్పుడు ఆంధ్రభాషానువాదరూపంలో పునర్ముద్రణకు రావడం ఆంధ్రపాఠక లోకానికి ఒక చక్కని ఉపహారంగా చెప్పవచ్చు.
ఈ గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా చూడవచ్చు. మొదటగ సుదీర్ఘ మయిన గ్రంథపరిచయం, తద్ద్వారా బౌద్ధదర్శన బౌద్ధసాహిత్యాల దిగ్దర్శనం, రెండవ భాగం పాలీమూలగ్రంథానికి సంస్కృత అనువాదం, అవసరమైన చోట్ల లఘుటిప్పణి, మూడవది ఆంధ్రభాషానువాదం. వీటిలో ప్రతిభాగమూ ముఖ్యమైనదే.

24, డిసెంబర్ 2012, సోమవారం

ఆంధ్రలో బౌద్ధమత వ్యాప్తి

ఆంధ్రలో బౌద్ధమత వ్యాప్తి

 ఆంధ్రాలో బౌద్ధమత వ్యాప్తి ప్రపంచ చరిత్రలో క్రీ.పూ. ఆరో శతాబ్దానికి ప్రత్యేకత ఉంది. వేద యుగంలో పెరిగిన జీవహింస, ఖర్చుతో కూడిన యజ్ఞ యాగాలు, క్రతువులు, సమాజంలో పేరుకుపోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు ఆలోచనాపరులైన కొద్దిమందిలో జిజ్ఞాసను రేకెత్తించాయి. వీటిని అధిగమించడానికి అజీవకులు, చార్వాకులు, జైన, బౌద్ధ మతకర్తలైన.. మహావీరుడు, బుద్ధుడు వంటివారు క్రీ.పూ 6వ శతాబ్దంలో భావవికాసానికి నాంది పలికారు.

అటు యూరప్‌లో, ఇటు ఆసియాలోనూ తీవ్ర చింతాన్వేషణలు సాగాయి. ఫలితంగా సనాతన మృత సంప్రదాయాలను ధిక్కరించే నూతన మతాలు వెలిశాయి. ఆర్య సంస్కృతిపై ‘అనార్య వర్గాలు’ లేవనెత్తిన తిరుగుబాటు బావుటాలే జైన, బౌద్ధ మతాలని కొందరు చరిత్రకారుల భావన. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఇతర వర్ణాల వారు చేసిన తిరుగుబాటని మరికొంతమంది చరిత్రకారులు భావించారు. ఈ తాత్త్విక ధోరణులే 6వ శతాబ్దం నాటికి యుగధర్మంగా రూపొందాయి.
జైనమతం: మహావీరుడు క్రీ.పూ. 540-468 కాలానికి చెందినవాడు. జైనమతానికి 24 మంది తీర్థంకరులు ఆధ్వర్యం వహించారు. రుగ్వేదంలో ప్రస్తావించిన ‘రుషభనాధుడు’ మొదటి తీర్థంకరుడు, మత స్థాపకుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాధుడు, చారిత్రక పురుషుడు. చారిత్రకంగా ఇతడే జైనమతాన్ని స్థాపించాడని ప్రతీతి. ఇరవై నాల్గో తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతడే చివరివాడు. ‘తీర్థంకరుడు’ అంటే మోక్షానికి మార్గదర్శకుడు. మహావీరుడు క్రీ.పూ. 540 ప్రాంతంలో వైశాలీ నగరంలోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. సిద్ధార్థ, త్రిశల ఇతడి తల్లిదండ్రులు. భార్య పేరు యశోద. 30 ఏళ్ల వయసులో మహావీరుడు గృహస్థ జీవితాన్ని పరిత్యజించాడు. అజీవక మత స్థాపకుడైన మక్కలి గోశాలుడు ఇతడి తాత్త్విక గురువు. మహావీరుడు 12 ఏళ్లు సత్యాన్వేషణ చేసి, చివరకు క్రీ.పూ. 498లో మహాజ్ఞాని అయ్యాడు. 30 ఏళ్ల పాటు జైనమతాన్ని ప్రచారం చేసి, క్రీ.పూ. 468లో తన 72వ ఏట ‘పావపురి’ వద్ద తనువు చాలించాడు. ‘రిజుపాలిక’ నది ఒడ్డున జృంభిక అనే గ్రామం వద్ద తపస్సు చేశాడు. ఏడాది తర్వాత జ్ఞానోదయం పొందాడు. జినుడు, కేవలుడని మహావీరునికి పేరొచ్చింది. జైనులను ‘నిర్గంధులని’ కూడా పిలుస్తారు.
మహావీరుని బోధనలు: 1. వైదిక కర్మలు చేయడం, దేవుణ్ని వేడుకోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు. 2. చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మోక్ష మార్గం. 3. జైనమత ప్రకారం ‘ఆత్మ’ ప్రాణులకే కాదు, ప్రతి వస్తువులోను ఉంటుంది. దేవుడితో నిమిత్తం లేదు. 4. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర- మోక్ష మార్గాలు. వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. (సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి) 5. పార్శ్వనాధుడు ప్రతిపాదించిన సత్య, అహింస, అపరిగ్రహ, అనస్తేయ అనే నాలుగు మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని అదనంగా జోడించాడు. వీటిని ‘పంచానువ్రత’ అని పిలుస్తారు. 6. జైనమతం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది. జైనమత చిహ్నాలు: రుషభనాధుని చిహ్నం వృషభం. పార్శ్వనాధుని చిహ్నం సర్పం. వర్ధమాన మహావీరుని చిహ్నం సింహం. నేమినాధుని చిహ్నం శంఖం.
జైన సంఘాలు: మొదటి జైన సమావేశం (జైన పరిషత్) పాటలీపుత్రంలో క్రీ.పూ. 300 ప్రాంతంలో స్థూల భద్రుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ జైన పరిషత్‌లో జైనమత 12 అంగాలు సంకలనం చేశారు. జైనమత పవిత్ర గ్రంథాలను ‘అంగాలు’ అని పిలుస్తారు. జైనమతం శ్వేతాంబరులు, దిగంబరులు అనే రెండు శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబరుల నాయకుడు స్థూలభద్రుడు. దిగంబరుల నాయకుడు భద్రబాహుడు. పార్శ్వనాధుడు శ్వేతాంబర వాదాన్ని, మహావీరుడు దిగంబర వాదాన్ని సమర్థించారు. రెండో జైన పరిషత్ వల్లభిలో నిర్వహించారు.
దీని అధ్యక్షుడు దేవరధి క్షమశ్రమణుడు. జైనమత గ్రంథాలు ప్రాకృత భాషలో రచించారు. మహావీరుడు తన బోధనలను అర్ధమాగధి భాషలో ప్రచారం చేశాడు. భద్రబాహుడు కల్ప సూత్రాలను రచించాడు. దిగంబరుల నాయకుడైన భద్రబాహుడుతో కలిసి మౌర్యచంద్రగుప్తుడు శ్రావణబెళగొళ వెళ్లి అక్కడే మరణించాడు. మహావీరుని అనుచరులను నిగ్రంధులు అంటారు (బంధాల నుంచి విముక్తి పొందిన వారు).
జైన సాహిత్యం: రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు. ఇతడు కన్నడ భాషలో రత్నపాంచాలిక, కవిరాజమార్గం రచించాడు. చాళుక్య రాజుల ఆస్థానంలో ఉన్న హేమచంద్రుడు త్రిశస్తిలక పురుష చరిత్ర రాశాడు. జైన మతాచార్యుడు కొండకుందాచారి- ప్రచనాసారం, సమయసారం గ్రంథాలు రచించాడు. హేమచంద్రుడు ‘పరిశిష్ట పర్వాన్ని’ రాశాడు.
ప్రసిద్ధి గాంచిన జైన కట్టడాలు: ఆంధ్ర దేశంలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక జైనుల ముఖ్య క్షేత్రం. జైనుల దేవాలయాలను బసదులు (వసతులు)గా పిలుస్తారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘జైన దిల్వారా జైన మందిరాలు’ రాజస్తాన్ అబూ పర్వతం దగ్గర నిర్మించారు.
ఒరిస్సాలో ఉదయగిరి, మహారాష్ట్రలో ఎల్లోరా గుహలు ప్రసిద్ధి గాంచాయి. జైనులు పూజించే స్త్రీ దేవతను ‘విద్యాదేవి’ అని పిలుస్తారు. జైన మతంలో సల్లేఖనం (శరీరాన్ని క్షీణించుకొని మరణించడం) ద్వారా పరమపదం చేరుకోవడం ఆచారం. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం ద్వారా పరమపదించాడు. భారతీయ వాస్తు-శిల్ప కళాభివృద్ధికి జైనమతం గొప్ప సేవ చేసింది.
బౌద్ధమతం: గౌతముడు (సిద్ధార్థుడు) క్రీ.పూ. 567లో కపిలవస్తు పట్టణానికి కొంత దూరంలో ఉన్న ‘లుంబిని’ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి శుద్దోధనుడు శాక్య తెగకు అధిపతి. తల్లి మాయాదేవి కోలియ తెగకు చెందింది. తల్లి మరణించడంతో సిద్ధార్థుడు మహాప్రజాపతి గోతమి చేతుల్లో పెరిగాడు.
అందుకే గౌతముడని కూడా అంటారు. శాక్యముని తథాగతుడు, సిద్ధార్థుడు అని కూడా పిలుస్తారు. సిద్ధార్థుని భార్య యశోధర, కుమారుడు రాహులుడు. చిన్ననాటి నుంచి తాత్త్విక చింతన, తార్కిక బుద్ధి ఎక్కువ. ఆరేళ్లు రాజగృహలో విద్య నభ్యసించాడు.
గయ (ఉరువేల) వద్ద సత్యాన్వేషణ కోసం 49 రోజుల పాటు కఠోర తపస్సు చేసి, బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో బౌద్ధ మతం స్థాపించి బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. బుద్ధుడు సార్‌నాథ్ వద్ద మృగదావనంలో (ఉత్తరప్రదేశ్) తొలిసారిగా ఐదుగురు శిష్యులకు బౌద్ధ ధర్మం బోధించాడు. బుద్ధుడు బోధించిన జ్ఞానాన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. ఈ ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం ఉంది, ఆ కారణానికి పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం అష్టాంగ మార్గం (ఎనిమిది సూత్రాలు).
అవి.. 1) సరైన దృష్టి 2) సరైన లక్ష్యం 3) సద్భాషణ 4) సత్కార్యం 5) సరైన జీవనం 6) సరైన కృషి 7) సరైన చైతన్యం 8) సరైన ధ్యానం.
ఎటువంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తై అష్టాంగ మార్గాలు అనుసరిస్తే ముక్తి పొందొచ్చని బోధించాడు. బుద్ధం, ధమ్మం (ధర్మం), సంఘం వీటిని త్రిరత్నాలు అంటారు. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. మనిషి మరణాంతరం కర్మ వెంటాడుతూనే ఉంటుందన్నాడు. కర్మకు కారణమైన కోరికను త్యజించడం ద్వారా మనిషి నిర్వాణం పొందగలడని బౌద్ధం చెబుతుంది. అజ్ఞానం ఊహా కల్పనకు కారణం. ఊహా కల్పనతో స్వీయచిత్తం కలుగుతుంది. దీని నుంచి స్పర్శ, భావన, కామన, సంగత్వం, అహంకారం, పునర్జన్మ ఒకదాని కారణంగా మరొకటి గొలుసుకట్టుగా పరిణమిస్తాయని బుద్ధుడు ప్రతిపాదించాడు. దీన్నే ప్రతీత్యసముత్పాదం అన్నాడు. అహింస, కరుణ, మైత్రి, ముదిత వంటి విషయాలకే బుద్ధుడు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ‘బహుజన సుఖాయ-బహుజన హితాయ’ సూత్రాన్ని నిత్య జీవితంలోకి అనువదించాడు. ప్రతి వ్యక్తి విశ్వమానవ కళ్యాణానికి పాటు పడాలని బుద్ధుడు ప్రబోధించాడు. భగవంతుడ్ని, ఆత్మ, వేదాలు, వర్ణ వ్యవస్థను బుద్ధుడు తిరస్కరించాడు.
మగధ, కోసల రాజ్యాల్లో బుద్ధుడు విస్తృతంగా పర్యటించి తన బోధనలను అర్ధమాగధి భాషలో ప్రబోధించాడు. అజాతశత్రువు, ప్రసేనజిత్తుడు, బింబిసారుడు బుద్ధుడికి సమకాలికులు. వీరు బౌద్ధాన్ని ఆదరించారు. కర్మకాండలు, వేదాల ప్రామాణికతను తిరస్కరించే అజితకేశకంబలి, పాకుదకాత్యాయన, మక్కలిగోసాలుడు మొదలైన తాత్త్వికులంతా ఈ కాలానికి చెందినవారే. బుద్ధుడు తన 80వ ఏట కుశీనగరంలో పరమపదించాడు.
బౌద్ధ సంఘ సమావేశాలు (సంగీతులు): ప్రథమ బౌద్ధ సంఘ సమావేశం (సంగీతి) రాజగృహలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు మహాకాశ్యపుడు. అజాతశత్రువు దీన్ని ఆదరించాడు. సుత్త, వినయ పీఠకాలు, బౌద్ధ సాహిత్యం ఈ సమావేశ కాలంలో సంకలనం చేశారు.
రెండో బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతస్థులు- స్థవిరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు. ఈ సమావేశం వైశాలీలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు సభాకామి. మూడో బౌద్ధ సమావేశం క్రీ.పూ. 250 ప్రాంతంలో పాటలీపుత్రలో నిర్వహించారు. దీనికి మొగ్గలి పుత్రతిస్యుడు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ సమావేశంలో ‘అభిదమ్మ పీఠిక’ను సంకలనం చేశారు.
క్రీ.శ. 1వ శతాబ్దంలో నాల్గో బౌద్ధ సమావేశం కాశ్మీర్‌లోని కుందలవనంలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు వసుమిత్రుడు. కనిష్కుడు దీన్ని ఆదరించాడు. ఈ బౌద్ధ సంగీతి సమావేశంలోనే బౌద్ధం- హీనయానం, మహాయానంగా చీలిపోయింది. మహాయాన బౌద్ధానికి ఆచార్య నాగార్జునుడు మూల పురుషుడు. నాగార్జునుడు ప్రజ్ఞాపారమిత, మూల మాధ్యమిక కారిక గ్రంథాలు రచించాడు. క్రీ.శ. 6వ శతాబ్దంలో వజ్రయాన అనే తాంత్రిక శాఖ ఏర్పడింది. బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన పుట్టుక, పరిత్యాగం, జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరి నిర్వాణం సంఘటనలను ‘పంచకళ్యాణాలు’ అని అంటారు.
బౌద్ధ సాహిత్యం: బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ‘త్రిపీఠకాలు’ అంటారు. వీటిని పాళీ భాషలో రచించారు. త్రిపీఠకాల్లో ముఖ్యమైంది సుత్త పీఠకం. సంస్కృత భాషలో అశ్వఘోషుడు బుద్ధ చరిత, సౌందరనందనం వంటి కావ్యాలు రచించాడు. బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించే కథలను ‘జాతక కథలు’ అంటారు. బుద్ధుడి జననాన్ని సూచించే సంజ్ఞ ‘ఏనుగు’. పరిత్యాగాన్ని సూచించేది ‘గుర్రం’. జ్ఞానోదయాన్ని సూచించేది ‘బోధి వృక్షం’. బుద్ధుడి ధర్మప్రసంగాన్ని సూచించేది ‘చక్రం’. మహాపరి నిర్యాణాన్ని సూచించే సంజ్ఞ ‘స్థూపం’.
తెలుగు నాట బౌద్ధ సంస్కృతి: గౌతమ బుద్ధుడు స్వయంగా ధాన్యకటకం (అమరావతి) వద్ద కాలచక్రతంత్రం ప్రవర్తింప చేశాడని, ధారణులను నిక్షిప్తం చేశాడని, అందువల్ల అమరావతి ధరణికోట అయ్యిందని జర్మన్ పండితుడు ‘హాలెంట్ హోప్‌మాన్’ తన పరిశోధనలో వెల్లడించాడు. అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు ‘మంజుశ్రీ మూలకల్పం’ బౌద్ధ గ్రంథం పేర్కొంది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన భట్టిప్రోలు స్థూపంలో భట్టిప్రోలు శాసనం ప్రకారం ‘బుద్ధ శరీరాన్ని నిక్షిప్తం’ అని రాశారు. ఈ శాసనంలోనే కుబేరక అనే రాజు ప్రస్తావన ఉంది. ఆంధ్ర దేశంలో సుమారు వంద బౌద్ధ స్థలాలను పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు.
భట్టిప్రోలు, అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల, జగ్గయ్యపేట, ఆదుర్రు, శాలిహుండం, ఫణిగిరి, చందవరం, రామతీర్థం, శంకరం, కోటిలింగాల, కొండాపూర్, పెదగంజాం, చినగంజాం మొదలైన ప్రాంతాల్లో స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలు బయల్పడ్డాయి. అశోకుడి శిలా శాసనాలు ఆంధ్ర దేశంలో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజులమందగిరిల్లో లభించాయి. ఇటీవల విశాఖపట్నం జిల్లా బావికొండ దగ్గర బుద్ధుడి పవిత్ర ధాతువులు లభించాయి. కరీంనగర్ జిల్లా ధూళకట్టలో స్థూపం బయటపడింది. శ్రీకాకుళంలో వంశధార నది ఒడ్డున శ్రీముఖలింగ శైవ క్షేత్రం ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో క్రీ.శ 8, 9 శతాబ్దాల నాటి అమితాబ, అక్షోభ్య (బుద్ధుడు), ఉపనీహవిషయ(స్త్రీ)మూర్తులు బయల్పడ్డాయి. ఇవి బౌద్ధమతానికి చెందినవి. నల్కొండ జిల్లా ఫణిగిరిలో గాజులబండ, తిరుమలగిరి ప్రాంతాల్లో బౌద్ధ అవశేషాలు లభ్యమయ్యాయి.

 

 
 

The life of the Buddha

The Vesak Full Moon Poya Day is tomorrow. It’s the Thrice Blessed Day, the day the Buddha was born, attained Enlightenment and passed away. When we commemorate this day, it would be great to reflect on the lifestory of the Buddha. We know you are being taught this at Dhamma School, but we hope the important incidents of His life we feature here would further enlighten you.
The Buddha, Shakyamuni was born as Siddhartha Gautama, the son of a local king in Kapilavastu, (what is now the Indian-Nepalese border) around the fifth century BCE. He was a member of a privileged and wealthy family and enjoyed a comfortable lifestyle.
The story goes back many eras to when there lived an ascetic called Sumedha (the future Buddha) who encountered the Buddha Dipankara. This meeting affected Sumedha in such a way that he too aspired to become a Buddha.

Sumedha worked hard to set out on the path of the cultivation of the “Ten Perfections.” The Bodhisattva cultivated these perfections over many lifetimes. The life, in which he becomes the Buddha Shakyamuni some time in the fifth century BC, represents the completion of Sumedha’s past aspiration and tireless activities.
An old tradition tells us that shortly before his final rebirth, the Bodhisattva spent his life as a god in Thusita (the Heaven of the Contented). Surveying the world from Thusita, the Bodhisattva saw that the time had come for him to take a human birth and at last become a Buddha. The Bodhisattva looked upon for five necessities to be born; time, country, place, race and mother.
The Birth
He saw that the ‘Middle Country’ of the great continent of Jambudvipa (India) was the ideal place in which to be born, for its people would be receptive to His message. The Bodhisattva was conceived on the full moon night in July; that night his mother, Maya, dreamt of a white elephant carrying a white lotus in its trunk entering her womb through her right side.

The white elephant here symbolised perfect wisdom and royal power; in India, an elephant was considered the most sacred animal on Earth.When Queen Maya described this dream to the advisors, they said the Queen is going to give birth to a very precious and powerful baby.
Having carried the Bodhisattva in her womb for exactly ten lunar months, Queen Mahamaya gave birth.
On the full moon day in May, passing by the Lumbini grove on her way to her home town, she was captivated by the beauty of the flowering sal trees and stepped down from her palanquin to walk among the trees in the grove. As she reached for a branch of a sal tree, which bent itself down to meet her hand, the cramps of birth came upon her.


As soon as the Bodhisattva was born, he took seven steps to the north and announced: “I am chief in the world, I am best in the world, I am first in the world. This is my last birth. There will be no further rebirths.” Because no child can immediately walk or talk, let alone make declarations at birth, these acts were taken to reveal the Buddha’s extraordinary nature, even as an infant.
The Bodhisattva was born among the Shakya people into a khsatriya family whose name was Gautama. Seven days after his birth his mother died and was born in the Thusita heaven. The child was named Siddhartha, which means “he whose purpose is accomplished.”

Soon after his birth, the infant Bodhisattva was examined by Brahmin specialists for “the thirty-two marks of the great man.” According to Buddhist tradition, two destinies are open to one who possesses these marks in full: he will either become a great “wheel-turning” king, ruling the four quarters of the Earth in perfect justice, or he will become a Buddha.
On hearing the Brahmins saying his son possessed the marks, Suddhodhana, father of the Bodhisattva, determined that his son should become a great king. To this end, he arranged matters that Siddhartha should have no occasion to become unhappy and disappointed with his life at home. In this way Suddhodhana hoped that he might prevent Siddhartha from giving up his home-life for the life of a wandering ascetic.
In search of the truth
After the strange and marvellous circumstances of his birth, Siddhartha grew up as the son of a royal family, confined within his palace, leading a life of luxury enjoyed by the very wealthy and privileged. This lifestyle made him more and more delicate and sensitive. The King didn’t give any opportunity for him to think about any unpleasant side to life.

One day, when Siddhartha was riding with his charioteer he encountered for the first time in his life a feeble old man, a severely ill man, and a corpse being carried to the funeral by mourners. This experience was shocking, and when afterwards he saw a wandering ascetic with serene and composed features, Siddhartha resolved that he will leave his home and take up the life of a wandering ascetic himself.
Siddhartha was now nearly thirty and married to Princess Yasodhara. King Suddhodhana had already begun preparations for the crowning of his heir, and in seven days, Siddhartha was to be crowned. Suddhodhana took every precaution to prevent his son’s flight and even gathered together all Shakya people capable of bearing arms to guard the palace exits. It was then that Siddhartha’s son, Rahula was born.
“It is a bondage which has come to me,” said Siddhartha when he heard of his first-born and only child, meaning that it was another tie added to those already holding him back.

However, that night, as he left his palace, he wanted to see his son. He went to the residence of his wife and opened the door. She was asleep on a bed, her hand on her son’s head. Siddhartha, with one foot in the doorway, stopped and watched.
“If I lift Yasodhara’s hand to take my son in my arms, she will awaken and my departure will be held back. When I become the Buddha, I will come back and see him.” And with these words he went to his horse, accompanied by his charioteer, Channa; Siddhartha was then twenty-nine years old and this was the beginning of a six-year quest for the truth.
Six-year quest
During these six years, he first spent time with and practised the systems of meditation taught by two leading ascetics of the time, Alara Kalama and Uddaka Rama Putta.
Although he mastered their respective theories, he felt that here he had not found any real answer to the problem of human suffering. So next, in the company of five other wandering ascetics, the Bodhisattva practised two extreme ways, which he thought would lead to Enlightenment.
First he tried the way of giving extreme pleasure to his body, when this failed, he restricted his food intake; as a result he became a living skeleton, but neither did this work. Then he realised that the only way to become the Buddha was to try the middle path.
One day, when he was seated quietly beneath the shade of a rose-apple tree, his mind had settled into a state of deep calm and peace. Buddhist tradition calls this state the first meditation or “dhyana”. As he reflected, it dawned on the Bodhisattva that it was by letting the mind settle into this state of peace that he might discover what he was looking for.
This required that he nourish his body and regain his strength. His five companions thought he had turned away from the quest and left him to his own devices.
Later, a young woman named Sujata offered milk-rice to the Bodhisattva. Now nourished, he seated himself beneath a bo tree, henceforth to be known as “the tree of awakening” or Bodhi Tree. It was once more the night of the Vesak full moon and he made a final resolve: “Let only skin, muscle and bone remain, let the flesh and blood dry in my body, but I will not give up this seat without attaining complete awakening.”
The awakening
Mara is a being who, in certain respects, is like Satan in Christianity. His name means “bringer of death” and his most common nickname is “the Bad One”. Mara is not so much a personification of evil as of the power of all kinds of experience to seduce and entangle the unwary mind.
So, as the Bodhisattva sat beneath the tree, firm in his resolve, Mara approached, mounted on his great elephant and accompanied by his dreadful armies. His one purpose was to assault the Bodhisattva and frustrate his efforts of finding the way to immortality.
The king of death tried to encourage his troops on, but even the arrows of his monsters lost their sharp points and were instantly covered with flowers. Enclosed in a zone of complete protection, the Bodhisattva laughed at his attackers because not a single hair on his body was disturbed.
Having overcome Mara’s attempts to distract him, the Bodhisattva then lifted his right hand and touched the ground calling on the very Earth as his witness. It signalled the defeat of Mara and the Buddha’s complete awakening. As the Buddha touched the Earth, Mara tumbled from his elephant and his armies fled in disarray.
The Buddha had achieved His purpose. In Buddhist terms, He had had a direct experience of Nirvana.
The first Buddhists
It is said that at that point His mind inclined not to teach: “This Dharma that I have found is profound, hard to see, hard to understand; it is peaceful, sublime, beyond the sphere of mere reasoning, subtle, to be experienced by the wise. But this generation takes delight in attachment, is delighted by attachment, rejoices in attachment and as such, it is hard for them to see this truth, namely, Nirvana”.
Buddha spent His first seven weeks near the bo tree. He thought for a while about whom He should first teach what He has accomplished. He looked for His first two teachers, but realised that both of them are dead already. Then He remembered the five ascetics who helped him.
In a deer park outside Benares, the Buddha approached the five and gave them instructions in the path to the termination of suffering that He had discovered. In this way, He set in motion the Wheel of Dharma, and soon, there were six awakened ones in the world. For the Buddha, this was the beginning of a life of teaching that lasted years. Those were the first followers of Buddhism.
Compiled by Janani Amarasekara


The life of the Buddha
HIS RETURN TO KAPILAVASTU AND HIS PASSING AWAY:
Seven years after He left his native city, the Buddha decided to return to Kapilavastu. King Suddhodhana had not yet forgiven his son for the “Great Departure,” which had caused him such disappointment. Suddhodhana even reproached his son for degrading himself as a beggar in his hometown in front of everybody.
When the Buddha paid a visit to His father’s house, Yasodhara, His former wife, adorned with all her jewels pushed Rahula, now aged eight, to Him, saying: “Rahula, that is your father. Go and ask Him for your inheritance!” Little Rahula did as he was told.
He greeted the Buddha politely, and waited until his father had left the house without giving any direct answer. Then Rahula followed Him with these words: “Father, give me my inheritance!” The Buddha’s reaction was as dignified as it was effective. He instructed His chief disciple Sariputra to ordain the boy as a novice, saying: “This is your inheritance.”
Plots to kill Him
Toward the end of His life, the monk Devadatta, His cousin, watched the Buddha aging great interest and decided to takeover the control of the Order as His successor.

Devadatta had the courage not to pursue his aim solely by trickery, but to announce it openly. The Buddha never allowed him to do so.
This made Devadatta His enemy. Devadatta, who was humiliated in public, planned a series of plots to kill the Buddha. The third attempt on the Buddha’s life took place within the city of Rajagaha. Devadatta bribed certain mahouts with promises to let the working elephant Nalagiri loose against the Buddha.
The mighty elephant, which had already killed one person, stormed through the streets on the exact path along which the Buddha was coming on His round to collect alms.
Throwing away a person with his trunk, the brute rushed at the yellow-robed Buddha who, unafraid, glowed with loving kindness towards the animal. Then the miracle took place!
Suddenly the raging elephant became calm and peaceful, and knelt before the Buddha, who lifted His right hand and patted the animal’s forehead. This is the well-known story of the Buddha’s defeat of a mad elephant in Rajagaha. At age 80 the Buddha was weary and not in a good physical condition:
“I am now old, and full of years; my journey is done and I have reached my sum of days; I am turning eighty years of age. And just as a worn-out cart is kept going with the help of repairs, so it seems is the Tathagata’s body kept going with repairs”.
Parinibbana
With an untiring enthusiasm for teaching, however, the Buddha decided to get on another long preaching journey. After passing through a number of villages, the Buddha proceeded to a place called Pava where He and His disciples were invited to dinner by a lowly blacksmith, Chunda.

After the meal, however, the Buddha, who was already in a weakened condition, became seriously ill. In spite of the severe pains, the Buddha insisted upon continuing His preaching tour, and soon ended up in a small village called Kushinagara. By this time the Buddha was too exhausted to go on and wanted to lie down.
The monk Ananda prepared a resting-place for Him between two blossoming sal trees. Then Ananda, who was struck by grief, lent against a door and wept. The Buddha called for him and explained: “Enough, Ananda, do not sorrow, do not lament. Have I not explained that it is the nature of things that we must be divided, separated, and parted from all that is beloved and dear?
How could it be, Ananda, that what has been born and come into being, that what is compounded and subject to decay, should not decay? It is not possible”.
The Buddha told Ananda to make His impending death known to the people in Kushinagara so that they could prepare His funeral. At that time, a wandering ascetic named Subhadda came to see the Buddha, but was sent away by Ananda who tried to prevent the exhausted old master from being disturbed.
But the Buddha, who overheard the conversation, asked the ascetic to approach His side and, after answering his questions on the Law, accepted Him into the Order. Thereby Subhadda became the last person to be accepted to the Order in the Buddha’s lifetime.
Then the Buddha gave the surrounding monks a last opportunity to question Him about the Law: “Ask, monks, in case you afterwards feel remorse, thinking: “We sat face to face with the Master, and yet we failed to ask Him personally.”
The Buddha asked this three times, but the monks remained silent. Then the Buddha gave them one more chance: if they did not dare to speak out of respect for Him, they should ask through a fellow-monk. Again the monks remained silent. It was evident that He had explained everything very clearly to them.
The night was far advanced, and it was quiet between the trees when the dying teacher gave the monks His last words: “Now, monks, I declare to you: all elements of personality are subject to decay. Strive on untiringly”! With these words He Passed Away.
Fact file
* The father of Prince Siddhartha was King Suddhodhana and mother was Queen Mahamaya.
* The wife of Prince Siddhartha was Yasodhara and his son was Rahula.
* Prince Siddhartha left his palace when he was aged 29.
* The Buddha preached Buddhism for 45 years before He passed away at the age of 80.
* The two main assistant Bhikkus of the Buddha were Sariputta Thera and Mugalan Thera, while Ananda Thera was the helper.

ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు


అమరావతి స్తూపంపై చెక్కిన పద్మం
బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని9 సమైక్య పరచి వారి కళానైపుణ్యానికి, సృజనా సామర్ధ్యానికి, నిర్మాణ నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు, దిజ్ఞాగుడు వంటి వార్లకు ఆంధ్రదేశం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.[1]
తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి ప్రకాశం జిల్లాలోని రామతీర్ధం వరకు, పడమర కరీం నగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలశాయి. క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్తూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్తూపాలున్న ముఖ్య క్షేత్రాలు.


బౌద్ధం ఆరంభ కాలంలో

విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద గురబక్తుల కోండ పై బౌద్ధారామం శిధిలావశేషాలు
తిపిటకాలలో పురాతన భాగమైన "సుత్త పిటకం" ప్రకారం "అస్సక" రాజ్యానికి (ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రాంతం) తథాగతుని కాలంలోనే బౌద్ధం ప్రవేశించింది. గోదావరి తీరాన ఆశ్రమంలో ఉండే "బావరి" అనే సాధువు ఉత్తర దేశాన బుద్ధుని ఉదయం గురించి తెలిసికొని ఒక శిష్యుని అక్కడికి పంపాడు. బావరికి, బుద్ధునికి జరిగిన సంవాదం "సుత్త పిటకం"లో చెప్పబడింది. ఆ శిష్యుడే బుద్ధుని బోధనలను ఆంధ్రదేశానికి తీసికొని వచ్చాడు. క్రీ.పూ. 5వ శతాబ్దం నుండి రమామరమి క్రీ.శ.14వ శతాబ్దం వరకు బౌద్ధం ఆంధ్రదేశంలో ఆదరణ పొందింది. [2]

అశోకుడు "మొగలిపుత తిస్స" అధ్వర్యంలో నిర్వహించిన మూడవ బౌద్ధ మండలికి ఆంధ్రదేశంనుండి ఆరు సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులు (చైత్యకులు, పూర్వశైలురు, అపరశైలురు, ఉత్తర శైలురు, రాజగిరికులు, సిద్ధార్థికులు) వెళ్ళారు. మౌర్య సామ్రాజ్యం పతనమైనాక దక్కనులో శాతవాహనులు, ఉత్తరాన కుషాణులు బౌద్ధాన్ని ఆదరించారు. అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. గుంటుపల్లి, భట్టిప్రోలు, పావురాలకొండ, బావికొండ, తొట్లకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది (బుద్ధుని జీవిత కాలంలో దక్షిణ భారతానికి రాలేదు అన్న అభిప్రాయం కూడా ఉంది). భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించారు. రాజుల హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్తానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో వేంగిదేశం ముఖ్యమైన మార్గం మరియు కూడలిగా ఉండేది.[3]

మహాయాన కాలం

అమరావతి స్తూపం నమూనా
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు నాగార్జునుడు మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు) , ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతలో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉన్నది.
బావికొండ మహా స్తూపం
ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు. ఆంధ్రదేశంలో కృష్ణాతీర వర్తకులు విదేశాలతో విరివిగా వ్యాపారం సాగించారు. తమ సంపదను బౌద్ధధర్మం అదరణకు విరివిగా వెచ్చించారు. ఆంధ్ర దేశంలో బౌద్ధాన్ని అధికంగా వర్తకులు మరియు సామాన్య జనం విశేషంగా ఆదరించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు వంటి పాలకులు వైదిక మతావలంబులైనా గాని బౌద్ధాన్ని కూడా కొంతవరకు ఆదరించారు. వారి రాణివాసజనం చాలామంది మాత్రం బౌద్ధం పట్ల యెనలేని ప్రేమతో విశేషంగా ఆరామాలకు దానాలు చేశారు. నాగార్జునుని కాలంనుండి మహాయానం విశేషంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లింది. వజ్రయానం కూడా కొంతవరకు ఆదరింపబడినప్పటికీ అప్పటికే వైదికమతం పుంజుకోవడంతో బౌద్ధం క్షీణించసాగింది.

స్తూపాలు, చైత్యాలు

భట్టిప్రోలు స్తూపం శిధిలావశేషాలు
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయిః
ధాతుగర్భ స్తూపాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులని గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
పారిభోజిక స్తూపాలు: భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
ఉద్దేశిక స్తూపాలు: ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.
బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి. అసంఖ్యాకమైన అటువంటి స్తూపలు ఆంధ్రదేశంలో ఎన్నో కనుగొనబడ్డాయి. వీటిలో అధికంగా కృష్ణాతీరంలో ఉన్నాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతమైనది మరియు అక్కడి (నాగ, యక్ష జాతి) ప్రజలు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించడం అందుకు కారణాలు.

కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు

చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్తూపం నమూనా
ఫణిగిరి త్రవ్వకాలలో లభించిన శిల్పఫలకం
భట్టిప్రోలు, గుంటుపల్లి, జగ్గయ్యపేట, అమరావతి (ధరణికోట), నాగార్జునకొండ, వేంగి వంటివి ఇటువంటి కొన్ని ముఖ్యక్షేత్రాలలోనివి.
అన్నింటిలోకి భట్టిప్రోలు అతి ప్రాచీన మైనది. క్రీ.పూ.3వ శతాబ్దిలో కుబేరుడు (కుబ్బీరకుడు) అనే రాజు కాలంలో ఇచట మహాచైత్యాన్ని నిర్మించారు. "బుద్ధ శరీరాణి మహానీయాని శర్మణే", "బుద్ధశరీరాణి నిక్షేప్తుం" అనే శాసనాలవలన ఈ చైత్యం బుద్ధుని శరీరధాతువుపైనే నిర్మించబడినట్లు భావిస్తున్నారు. గుంటుపల్లి కూడా దాదాపు భట్టిప్రోలు సమకాలికమైనదే. ఇక్కడ కొండమీద చైత్యగృహం, ఆరామమంటపాలు, స్తూపాలు ఉన్నాయి. ఈ తీర్ధం పెక్కు భక్తులను ఆకర్షించేదనడానికి ఇక్కడ ఉన్న పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.

దక్షిణాపధ బౌద్ధ క్షేత్రాలన్నింటికీ అమరావతి తలమానికమైనది. దీని అప్పటిపేరు ధనకటక లేదా ధాన్యకటకం లేదా ధరణికోట. ఇక్కడ దొరికిన మౌర్య లిపి శాసనాల ఆధారంగా దీని నిర్మాణం అశోకుని కాలంలో జరిగిఉండవచ్చును. అశోకుడు దక్షిణాపధానికి పంపిన బౌద్ధభిక్షువు మహాదేవుడు అమరావతి కేంద్రంగానే తన ధర్మ ప్రచారం సాగించి ఉండవచ్చును. నాగార్జునుని మహాయానకాలంలో అమరావతి బౌద్ధవిజ్ఞానానికి పీఠమై జగద్విఖ్యాతమయ్యింది. చైనా యాత్రికుడైన హ్యూన్ త్సాంగ్ తాను ధాన్యకటక విహారంలో అభిధమ్మపిటకాన్ని అభ్యసించినట్లు వ్రాసుకొన్నాడు. ఇక్కడి మహాచైత్యం ఆంధ్రుల నిర్మాణ చాతుర్యానికి, శిల్పకౌశల్యానికి గీటురాయి.

కృష్ణానదీ తీరాన వెలసిన మరొక ఆరామస్థానం జగ్గయ్యపేట అప్పటిలో "ఎలగిరి" అనబడేది. క్రీ.పూ.2వ శతాబ్దిలొనే ఇక్కడ మహాచైత్యవిహారాదులు వెలశాయి. ఇక్కడి పుణ్యశాలా శిల్పంలో మహాబలిపురం రాతిరధాలను, అజంతా చిత్రాలను పోలిన రీతి ఉంది. మహాయాన సిద్ధాంతకర్త ఆచార్యనాగార్జునుని స్థానమైన శ్రీపర్వతంలోని మహాచైత్యవిహారాలు కూడా బుద్ధధాతువుపైనే నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఇక్కడి విహారాన్ని "పారావత విహారం" అని చైనా యాత్రికుడు ఫాహియాన్ పేర్కొన్నాడు. ఇక్కడ ఐదంస్తులం భవనంలో పెద్ద గ్రంధాలయం ఉండేది. సింహళదేశపు యాత్రికులకోసం ప్రత్యేక విహారాలుండేవి. ఇక్కడినుండి మహాయానం చైనా, టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది.
వేంగిని హ్యూన్‌త్సాంగ్ "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. ఇక్కడ అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వాటిలో మూడువేల బౌద్ధ భిక్షువులుండేవారని వ్రాశాడు. ఇక్కడ చైత్యగృహంలో జనబోధిసత్వుడు నివశిస్తూ తర్కశాస్త్రం వ్రాశాడట. ఆ జనబోధిసత్వుడే దిజ్ఞాగుడు అని చరిత్రకారులు భావిస్తున్నారు.

వజ్రయాన కేంద్రాలు: ఉత్తరాంధ్ర తీరంలోని రామతీర్ధం, శాలిహుండం, బొజ్జన్నకొండ, సంఘరం వంటి క్షేత్రాలలో వజ్రయానపు చిహ్నాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళీంగపట్నం రేవునుండి వజ్రయానం సుమత్రాదీవులకు పయనించి ఉండవచ్చును. సంఘరం అసలు పేరు సంఘారామం కావచ్చును. ఆరామతీర్ధం రామతీర్ధంగా పరిణమించి ఉండవచ్చును. ‍‌బొజ్జన్నకొండలోని లింగాలమెట్టయే బోరోబదూరు బౌద్ధక్షేత్రానికి నమూనా అయ్యిందని ఒక అభిప్రాయం

ఇవే కాకుండా గుమ్మడిదుర్రు, గుడివాడ(కృష్ణా జిల్లా), ఘంటసాల, విద్యాధరపురం, బుద్ధాం, చినగంజాం, ఫణిగిరి, కొండాపూర్, ముంజలూరు, కుమ్మరిలోవ, తగరపువలస(గుడివాడ దిబ్బ) సరిపల్లి, వంటి అనేక క్షేత్రాలు కనుగొనబడ్డాయి. అమరావతితో సహా పంచారామాలు మొదట బౌద్ధ క్షేత్రాలుగా ఉండేవని ప్రతీతి.,

ముఖ్యమైన క్షేత్రాల జాబితా

క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాఘి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, వాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ.
గుంటుపల్లి స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని బౌద్ధమతపు శిధిలాలు లేదా చిహ్నాలు ఉన్న స్థలాలు క్రింద ఇవ్వబడ్డాయి.
శ్రీకాకుళం జిల్లా
విజయనగరం జిల్లా
విశాఖపట్నం జిల్లా
తూర్పు గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా
ఖమ్మం జిల్లా
కృష్ణా జిల్లా
నల్గొండ జిల్లా
కరీంనగర్ జిల్లా
నిజామాబాద్ జిల్లా
  • పశిగం
  • వడ్డమణి
కర్నూలు జిల్లా
  • బెలుం గుహలు
  • జొన్నగిరి (ఆశోకుని శిలాశాసనాలు)
  • రాజులమందగిరి (ఆశోకుని శిలాశాసనాలు)
మెదక్ జిల్లా
రంగారెడ్డి జిల్లా
  • గాజులబండ
గుంటూరు జిల్లా
ప్రకాశం జిల్లా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వైఎస్ఆర్ జిల్లా

23, డిసెంబర్ 2012, ఆదివారం

బౌద్ధ మతము

బౌద్ధ మతము

బొజ్జన్నకొండ బౌద్ధారామం, విశాఖ జిల్లా. వద్ద ధ్యాన బుద్ధుని ప్రతిమ (రాతిలో చెక్కబడినది)
థాయిలాండ్‌లో బుద్ధుని చిత్రం
బౌద్ధ మతము లేదా బౌద్ధం(Buddhism) ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.[1] బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానము, థేరవాదము. [2] తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానం తో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.
గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంధం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు "మహాయాన సూత్రాలు" అనే రచనను విశ్వసిస్తారు. దీనిని థేరవాదులు అంగీకరించరు. [3]
గుంటుపల్లి స్తూపాలు - హీనయానం కాలం - క్రీ పూ 200 నాటివి

థేరవాద, మహాయాన సంప్రదాయాలు బౌద్ధంలో ఉన్న రెండు ప్రధాన విభాగాలు. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. కాని వీటన్నింటిలో ఏకాభిప్రాయంగా పరిగణింపబడే ముఖ్య సూత్రాలను చెప్పడానికి నిపుణులు ప్రధానంగా పాళీ భాష, టిబెటన్ భాష లోనూ, ఇంకా అనువాద రూపంలో ఉన్న మంగోలియన్, చైనా భాషల గ్రంధాలలోనూ, కొద్దిగా లభించే సంస్కృత మూలాలలోనూ ఉన్న విషయాల ఆధారంగా కొన్ని ప్రధాన సూత్రాలను ఉదాహరిస్తారు. అయితే వీటిలో భిన్నాభిప్రాయాలు, భిన్న సంప్రదాయాలు ఉండవచ్చును.
  • గౌతమ బుద్ధుడు వారి గురువు, ప్రవక్త
  • మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - వీటిని సిద్ధాంతపరంగా అంగీకరిస్తారు. కాని కొన్ని సంప్రదాయాల ఆచరణలో వీటిని (కొంత గాని, పూర్తిగా గాని) అమలు చేయకపోవచ్చును.
  • సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును.
  • నిర్వాణం పరమోత్కృష్ట గమ్యమని భావిస్తారు. థేరవాదులు ల నమ్మకం ప్రకారం బుద్ధుడు పొందిన నిర్వాణమే ఇతరులకూ లభిస్తుంది, రెండు రకాల నిర్వాణాలుండవు. ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు మొదటిగా కనుక్కొని ఇతరులకు బోధించాడు.

ఆరంభం, చరిత్ర


ధ్యానమగ్నుడైన గౌతమబుద్ధుని దీక్ష భగ్నం చేయడానికి మారుడు దండెత్తడం - సూచనా శిల్పం - అమరావతి స్తూపం - గ్విమెట్ మ్యూజియం నుండి.
బౌద్ధ ధర్మాన్ని మొదటిగా బోధించిన గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్ధుడు. ఇతడు లుంబినిఅనే చోట జన్మించాడు. కపిలవస్తు అనే నగరంలో పెరిగాడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు అనే రాజు. తల్లి మాయాదేవి
సిద్ధార్ధుని తాత్విక అన్వేషణ గురించి బహుళంగా ప్రచారంలో ఉన్నకధ - సిద్ధార్ధుని జననం తరువాత అతని తండ్రి శుధ్ధోదనునికి "ఈ బాలుడు మునుముందు గొప్ప చకవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడు" అని పండితులు జోస్యం చెప్పారు. తన కుమారునికి వైరాగ్యం కలుగరాదనే కోరికతో తండ్రి అతనికి బయటి లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలలో పెంచాడు. యశోధర అనే చక్కని యువతితో వివాహం జరిపాడు. వారికి రాహులుడనే పుత్రుడు జన్మించాడు. కాని తన 29వ యేట సిద్ధార్ధుడు నగరంలో ప్రయాణిస్తుండగా జనుల కష్టాలను, ఒక పండు ముసలివానిని, ఒక శవాన్ని, ఒక సాధువును చూచాడు. ఈ దృశ్యాలను "నాలుగు దృశ్యాలు" అంటారు. 

ఈ దృశ్యాలను చూచిన సిద్ధార్ధుని మనసు తాత్విక చింతనవైపు మళ్ళింది. ఒకరాత్రివేళ తన కుటుంబాన్ని, రాజ భోగాలను వదలి రాజప్రాసాదంనుండి నిష్క్రమించాడు. సత్యాన్వేషణకై వివిధ మార్గాలను ప్రయత్నించాడు. కొంతకాలం కఠోరమైన దీక్షను సాగించాడు. కాని ఆ విధంగా శరీరాన్ని మనసును క్షోభ పెట్టడం నిరర్ధకమని తెలుసుకొన్నాడు.


తరువాత దీక్షను అవలంబించాడు. అతిగా సుఖలోలత లేకుండా, కఠోరమైన యోగదీక్ష కాకుండా మధ్యేమార్గంలో పయనించాలని నిశ్చయించుకొన్నడు. ఒక గ్రామ యువతి ప్రసాదించిన భిక్షను ఆరగించి, బోధగయలో ఒక రావి చెట్టుక్రింద ధ్యానమగ్నుడయ్యాడు. ఈ చెట్టునే బోధివృక్షమంటారు.పరమ సత్యాన్ని కనుగొనేవరకూ కదలరాదని నిశ్చయించుకొన్నాడు. 49 రోజుల ధ్యానం తరువాత అతనికి జ్ఞానోదయమైంది. అప్పటినుండి అతను బుద్ధుడు అయ్యాడు. తాను కనుగొన్న ధర్మాన్ని అందరికీ బోధించసాగాడు.


గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో జీవించాడని పరిశోధకుల అంచనా. కాని అతని జన్మ దినం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి.  తన 80వ యేట కుశీనగరంలో మరణించాడు. 

ఆరంభ దశ

బౌద్ధమతం చరిత్రను క్రింది దశలుగా విభజింపవచ్చును
  1. ఆరంభ బౌద్ధం - ఈ దశను "హజిమె నకమురా" అధ్యయనకారుడు మళ్ళీ రెండు దశలుగా విభజించాడు.:
    1. అసలు బౌద్ధం - బుద్ధుడు బోధించినది (మతంగా రూపొందనిది)
    2. సనాతన బౌద్ధం - ఆరంభ దశలో
  2. బౌద్ధ సిద్ధాంతం ఆరంభ దశ - నికాయ బౌద్ధం
  3. మహాయానం ఆరంభ దశ
  4. మహాయానం పరిణతి దశ
  5. వజ్రయానం
అయితే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వచ్చిన దశలు అనలేము. ఉదాహరణకు మహాయానం ఆవిర్భవించిన తరువాత చాలాకాలం వరకు సనాతన బౌద్ధం అధిక ప్రాభవం కలిగి ఉంది.
సుత్త పిటక, వినయపిటక
ఆరంభ దశలో బౌద్ధం సుత్త పిటకం, వినయ పిటకం అనే మౌలిక పాళీ సూత్రాలపైనా, నాలుగు నికాయ (ఆగమ) సూత్రాలపైనా ఆధారపడింది (కొద్దిమంది పరిశోధకులు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు ). దాదాపు అన్ని ఆరంభకాలపు రచనలలోనూ కనిపించే క్రింది సిద్ధాంతాలు బుద్ధుని బోధనలనుండి నేరుగా గ్రహించబడినవని భావిస్తున్నారు.
  • మూడు లక్షణాలు లేదా జీవ ధర్మాలు - అనిత్యము, దుఃఖము, అనాత్మత - (పాళీ భాషలో అనిచ్చ, దుక్క, అనత్త)
  • ఐదు తత్వాలు లేదా పంచ కంధాలు - ఆకారం (రూపం), వేదన (బాధ), సంజ్ఞ (ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం), సంస్కారం (భావనలు కలగడం), విజ్ఞానం
  • ప్రతి సముత్పాదన (dependent arising) లేదా కార్యకారణత్వం - ఒక దాని కారణంగా మరొకటి జరగడం
  • కర్మ, పునర్జన్మ
  • నాలుగు మహోన్నత సత్యాలు - చత్వారి ఆర్య సత్యాణి - దుఃఖము (జన్మ, జీవితం, మరణం కూడా దుఃఖ మయాలు), సముదాయము (సుఖ కాంక్ష వలన దుఃఖము కలుగుతుంది), నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), మార్గము (అష్టాంగ మార్గం వలన కాంక్షను త్యజింపవచ్చును)
  • అష్టాంగ మార్గము - సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్‌కర్మ (మంచి పనులు), సమ్యగ్‌జీవనము (మంచి జీవితం), సమ్యగ్‌వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్‌స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్‌సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్‌దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్‌సంకల్పము (మంచి సంకల్పము)
  • నిర్వాణము
కొందరు పరిశోధకులు వేరే ప్రమాణాలను ప్రతిపాదించారు.

సంఘాలు

బుద్ధుని పరినిర్వాణం తరువాత కొద్ది కాలానికే మొదటి బౌద్ధ మండలి (first Buddhist council) సమావేశమయ్యంది. బుద్ధుని అమూల్య బోధనలు కలుషితం కాకుండా వాటిని గ్రంధస్తం చేయడం ఈ మండలి సంకల్పం. బుద్ధుని సన్నిహితుడైన ఆనందుడు తెలిపిన సూత్రాలు సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ది చెందాయి.. సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు. అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం.

అశోకుడు పాటలీ పుత్ర నగరంలో మూడవ బౌద్ధ మండలిని నిర్వహింప జేశాడు. అయితే కొందరు అబౌద్ధులను సంఘంలోంచి వెలివేసి, సంఘాన్ని ఏకీకృతం చేసినట్లు మాత్రమే అశోకుని శాసనాలు చెబుతున్నాయి. స్థవిరులు అనబడే వారు, మహాసాంఘికులు అనబడేవారు "వినయం" గురించి గట్టిగా ఒకరినొకరు వ్యతిరేకించారు. సంఘంలో ఉండవలసిన వారి అర్హతల గురించి ఈ విభేదాలు పొడసూపాయి. కొంత కాలం ఒకే సంఘారామంలో ఇరు వర్గాలవారు కలసి ఉండి ఉండవచ్చును. కాని షుమారు క్రీ.శ. 100 నాటికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని ఉంటారు. స్థవిరులలోంచి వచ్చిన మరొక శాఖ థేరవాదంగా పరిణమించింది. స్థవిరులు సంఘం అర్హతలుగా ప్రతిపాదించిన నియమాలు మరీ కఠినంగా ఉన్నాయని మహాసాంఘికులు అభిప్రాయపడ్డారు. 

అనంతర పరిణామాలు

అశోకుని కాలంలో బౌద్ధమతం విస్తరణ (క్రీ.పూ.260–218).
బౌద్ధ రచనల ప్రకారం 2వ శతాబ్దానికి చెందిన ఇండో-గ్రీక్ రాజు "1వ మెనాందర్" బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
ఈ విధమైన విభేదాల ఫలితంగా ఒకో శాఖ తమదైన "అభిధమ్మము" (సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు) ఏర్పరచుకోవడం ప్రాంభించింది. బౌద్ధం విస్తరించిన కొలదీ అభిధమ్మ పిటకం అనే వ్యవస్థీకృత సిద్ధాంతం రూపొందింది. బుద్ధుని సందేశాల పరిధిని విస్తరించడానికి ఇష్టం లేని మహాసాంఘికులు మాత్రం వేరే అభిధమ్మపిటకాన్ని తయారు చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే 5వ శతాబ్దానికి చెందిన ఫాహియాన్ మరియు 7వ శతాబ్దానికి చెందిన హ్యూన్‌త్సాంగ్ రచనల ప్రకారం మహాసాంఘికులకు కూడా ఒక అభిధమ్మం ఉంది.

ఆరంభంలో భారత దేశంలో నిదానంగా వ్యాపించిన బౌద్ధం అశోకుని కాలంలో దేశం నలుమూలలా, మరియు దేశాంతరాలలోనూ విస్తరించింది. ఈ కాలంలోనే అనేక స్తూపాల నిర్మాణాలు జరిగాయి. ధర్మ పధాన్ని ప్రచారం చేయడానికి అశోకుని దూతలు దేశదేశాలు ప్రయాణమయ్యారు. శ్రీలంకకు, సెల్యూసిడ్ రాజ్యాలకు, మధ్యధరా రాజ్యాలకు బౌద్ధ భిక్షువులు తరలి వెళ్ళారు. ఇలా దేశపు ఎల్లు దాటిన బౌద్ధం ఒకవైపు శ్రీలంకకు, అటునుండి క్రమంగా ఆగ్నేయ ఆసియా దేశాలకు వ్యాపించింది. మరొకవైపు మధ్య ఆసియా, ఇరాన్ ప్రాంతాలకు విస్తరించి, చైనాలో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకొంది. కాలక్రమంగా శ్రీలంక, ఆగ్నేయాసియాలలో థేరవాద బౌద్ధంగాను, టిబెట్ మరియు చైనాలో తాంత్రిక లేదా వజ్రయాన ప్రభావితమైన బౌద్ధంగాను పరిణమించాయి. ఈ కాలంలో బౌద్ధ సంఘంపై ఇతర నాగరికతల ప్రభావం మరింతగా పడసాగింది. అంతే కాకుండా భారతదేశంలో ఇతర (బౌద్ధం కాని) మతాలు బౌద్ధం వలన ప్రభావితం కాగా, బౌద్ధం ఆ మతాలవలన కూడా ప్రభావితమవ సాగింది.

మహాయానం ప్రాభవం


చైనాలో క్రీ.శ. 650 "టాంగ్" వంశపు కాలం నాటి బుద్ధ విగ్రహం - చైనా బౌద్ధం మహాయాన సంప్రదాయానికి చెందినది. అందులో ఇప్పుడు "Pure Land" మరియు "జెన్" అనే రెండు ప్రధాన శాఖలున్నాయి.
1 నుండి 10వ శతాబ్దంలో మహాయానం విస్తరణ.
మహాయానం ఆరంభం ఎలా ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియడంలేదు. షుమారు 1వ శతాబ్దంలో పశ్చిమోత్తరాన కుషాను రాజ్యంలోను, దక్షిణాన శాతవాహనుల దేశంలోను, పశ్చిమాన భరుకచ్చం (భారుచ్) సమీపంలో అజంతా, ఎల్లోరా ప్రాంతాలలోను ఆవిర్భవించిన వివిధ దృక్పథాల సంగమమే మహాయానం కావచ్చును. స్తూపాలను పూజించడం, బోధిసత్వుని గాధలను చిత్రాల ద్వారా సామాన్యులలో ప్రచారం చేయడం అనే విధానాలు మహాయానం ఆవిర్భవానికి మూల ఘటనలు కావచ్చును. కాని ఈ అభిప్రాయాన్ని కొందరు పండితులు త్రోసిపుచ్చుతున్నారు.మహాయానం సిద్ధాంతాలలో "సర్వస్తివాదం" మరియు "ధర్మగుప్తకం" అనే రెండు తెగల ప్రభావం ఎక్కువగా ఉంది.

మహాయానులు బోధిసత్వుని మార్గానికి ప్రాధాన్యతనిస్తారు. 2వ శతాబ్దంలో కుషాణు చక్రవర్తి కనిష్కుడు నాలుగవ బౌద్ధ మండలిని సమావేశపరచాడు. ఈ మండలిని థేరవాదులు అంగీకరించరు. ఈ మండలి సమావేశంలో త్రిపిటకాలకు అదనంగా మరికొన్ని సూత్రాలు (పద్మ సూత్రం, హృదయ సూత్రం, అమితాభసూత్రం వంటివి) ఆమోదం పొందాయి. "అందరికీ" నిర్వాణం లభించడం సాధ్యమేనని ఈ మండలిలో ఆమోదించారు. నిర్వాణం కోసం సాధన చేసేవారికి దైవ స్వరూపులైన బుద్ధులు, బోధిసత్వులు అనే భావాలను ఆంగీకరించారు. నిర్వాణం "అందరికీ" అందుబాటులో ఉన్నందున ఇది "మహాయానం" (పెద్ద బండి) అయ్యింది. అయితే ఈ శాఖ అంతకు ముందే ఉన్న సర్వస్తివాదానికి కేవలం ప్రతిరూపమేనని కొందరు పండితుల అభిప్రాయం.. ఈ సిద్ధాంతాలు గ్రంధస్తం చేయబడి, మధ్య ఆసియా, చైనాలకు దేశాలకు విస్తరించాయి. చైనాలో మరిన్ని మార్పులు జరిగిన మహాయానం ఆ రూపంలో జపాన్, వియత్నాం, కొరియా ప్రాంతాలకు విస్తరించింది.


అయితే మహాయాన బౌద్ధానికి పటిష్టమైన సిద్ధాంతాలను ఏర్పరచింది నాగార్జునుడు. షుమారు 150-250 మధ్య కాలానికి చెందిన ఈ ఆచార్యుని ప్రభావం మహాయానంపై అసమానమైనది. త్రిపిటకాల పరిధిలో ధర్మము, మోక్షము, శూన్యత అనే భావాలను ఏకీకృతం చేసి, అనాత్మత మరియు కార్యకారణత్వం వంటి మౌలిక సూత్రాలతో విభేదం లేకుండా పరిష్కరించాడు. నాగార్జునుడు బోధించిన మార్గాన్ని మాధ్యమిక వాదము అంటారు. కనిష్కుల తరువాత గుప్తుల కాలం (4-6 శతాబ్దాలు)లో కూడా బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఒక ప్రక్క నాగార్జునుని మాధ్యమిక వాదము, మరొక ప్రక్క యోగాచార బౌద్ధంగా పరిణమించిన సర్వస్తివాదము తమ తమ అనుయాయులలో బలంగా ఉన్నాయి. ఇలా మాధ్యమిక వాదము, యోగాచారము కలగలిపిన సంప్రదాయాలు ఇండో-టిబెటన్ బౌద్ధానికి మూలాలుగా స్థిరపడ్డాయి.

వజ్రయానం


తాంత్రిక ఆచారాలతో కూడుకొన్న వజ్రయాన బౌద్ధం ఆరంభమైన విధానాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. టిబెటన్ సంప్రదాయం ప్రకారం శాక్యముని బుద్ధుడే తంత్రాన్ని బోధించాడని, కాని అవి రహస్యాలు గనుక బుద్ధుని అనంతరం చాలా కాలానికి గాని గ్రంధస్తం కాలేదని అంటారు. వజ్రయానం పరిణతిలో నలందా విశ్వవిద్యాలయం ప్రముఖ పాత్ర కలిగి ఉంది. 11వ శతాబ్దం వరకు ఇక్కడినుండి టిబెట్, చైనాలకు ఈ తాంత్రిక విధానాలు సంక్రమించాయి. టిబెటన్ బౌద్ధంలో ఈ విధానాల ప్రభావం బలంగా ఉంది. డేవిడ్ రోనాల్డ్‌సన్ అనే ఆచార్యుని అభిప్రాయం ప్రకారం గుప్తుల అనంతరం బౌద్ధానికి ప్రజలలో ఆదరణ కొరవడింది. సామాన్యులను ఆకట్టుకొనడానికి అప్పటికే సమాజంలో ఆచరణలో ఉన్న సిద్ధ తంత్రాల వినియోగం అధికమయ్యింది. మరో 200 సంవత్సరాల తరువాత ఈ సంప్రదాయాల మిళితం వజ్రయానం అనే సిద్ధాంతంగా రూపొందింది.

పరిసర దేశాలలో బౌద్ధం స్థిరంగా ఉన్నప్పటికీ భారత దేశంలో క్షీణించసాగింది. క్రమంగా సంపూర్ణంగా అంతరించింది.

దక్షిణ (థేరవాద) బౌద్ధం


థేరవాదం (పూర్వవాదం లేదా సనాతనవాదం) అనేది బౌద్ధంలో అన్నింటికంటే ప్రధమ దశలో ఆవిర్భవించిన సిద్ధాంతాలకు సమీపంలో ఉన్న సంప్రదాయం.క్రీ.పూ.250లో జరిగిన మూడవ బౌద్ధ మండలి సమావేశంలో ఇతరులతో విభేదించిన స్థవిరులు (విభజ్జన వాదులు) క్రమంగా థేరవాదులయ్యారు. భారతదేశంలో ఈ వాదం క్షీణీంచినప్పటికీ శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలలో ఇప్పటి బౌద్ధమతం థేరవాదుల మార్గానికి సమీపంగా ఉంది.

థేరవాదుల విశ్వాసాలు, ఆచరణలు ఆరంభంలో వెలువడిన పాళి సూత్రాలకు, వాటిపై వచ్చిన వ్యాఖ్యలకు పరిమితమై ఉంటాయి. కొన్ని శతాబ్దాలు మౌఖికంగా ఉండిపోయిన వీరి సూత్రాలు క్రీ.పూ.1వ శతాబ్దంలో శ్రీలంకలో గ్రంధస్తం చేయబడ్డాయి. ఆ సమావేశాన్నే థేరవాదులు "నాలుగవ బౌద్ధమండలి"గా భావిస్తారు. మౌలిక సూత్రాలైన సుత్త పిటకం, వినయపిటకం, త్రిరత్నాలు వంటి సిద్ధాంతాలకు థేరవాదులు సంకలనం చేసిన రచనలే ఆరంభదశలోని బౌద్ధ సిద్ధాంతాలకు అతి సమీప ఆధారాలుగా పండితులు భావిస్తారు.


థేరవాదులు విభజ్జన వాదము (విశ్లేషణా బోధన)ను సమర్ధిస్తారు. గ్రుడ్డి నమ్మకాలకు బదులు సాధకుల అనుభవం, విమర్శనాత్మక పరిశీలన మరియు హేతువిచారణ ద్వారానే జ్ఞానం లభిస్తుందని థేరవాదుల సిద్ధాంతం. వీరి బోధనల ప్రకారం కామం, క్రోధం, మోహం వంటి మాలిన్యాలవలన సుఖలాలసత్వం, అందుమూలంగా దుఃఖం కలుగుతాయి. అష్టాంగమార్గ సాధన ద్వారా ఈ మాలిన్యాలను తొలగించి, మోహాన్నుండి బయటపడి దుఃఖాన్నుండి విముక్తులు కావచ్చును. అష్టాంగ మార్గం ద్వారా నాలుగు మహోన్నత సత్యాలు అవగతమౌతాయి. తద్వారా జ్ఞానము, నిర్వాణము లభిస్తాయి. నిర్వాణమే థేరవాదుల పరమార్ధం.


థేరవాదం ప్రస్తుతం ప్రధానంగా శ్రీలంక, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా దేశాలలోను, కొద్దిభాగం చైనా , బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియాలలోను ఆచరణలో ఉంది. ఐరోపా, అమెరికా ఖండాలలో కూడా థేరవాదం పట్ల ఆకర్షణ పెరుగుతున్నది.

తూర్పు దేశాలలో మహాయాన బౌద్ధం

చైనా మింగ్ వంశపు కాలానికి చెందిన "గ్వానయిన్" (కరుణా దేవత) పింగాణీ ప్రతిమ
మహాయానం అనే విభాగం సనాతన బౌద్ధ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను జోడించడం ద్వారా విస్తరించింది. మహాయానులు "బోధిసత్వ" భావానికి ప్రాముఖ్యత ఇస్తారు. సాధన ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందడం అనే ప్రాధమిక లక్ష్యం కంటే మహాయాన సాధకులు లోకంలో ఉండి అందరినీ దుఃఖాన్నుండి విముక్తులను చేయాడమనే లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. బోధిసత్వులు సకల జీవులకూ నిర్వాణాన్ని పొందడంలో తోడ్పడతారని వారి విశ్వాసం. అవధులు లేని "మహా కరుణ"యే బోధిసత్వుల లక్షణం. అదే అందరికీ నిర్వాణాన్ని ప్రసాదిస్తుంది.
శూన్యత, ప్రజ్ఞాపారమిత, తథాగతత్వము అనే ఉన్నత తత్వాలు మహాయానంలో తరచు ప్రస్తావించబడుతాయి. తథాగత గర్భ సూత్రాలు పరమ సత్యాన్ని, ధర్మాన్ని, ఇదే అన్నింటికంటే గొప్ప సత్యమనీ మహాయానుల విశ్వాసం. అయితే ప్రస్తుతం చైనాలో అన్ని సూత్రాలకు సమానమైన ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది.. మహాయాన సంప్రదాయంలో కొన్నిమార్లు బుద్ధుడు లేక ధర్మం ప్రత్యక్షం అవుతారని సూచనలున్నాయి. ఇది "దేవుడు" అనే భావానికి మహాయానంలో స్థానం కల్పిస్తుంది. మహాయానంలో త్రిపిటకాలకు అదనంగా మహాయాన సూత్రాలు, పద్మ సూత్రాలు, మహాపరినిర్వాణ సూత్రాలు ఉన్నాయి. వీటి సాధన ద్వారా బుద్ధత్వం పొందవచ్చునని వారి విశ్వాసం.

ప్రస్తుత కాలంలో చైనా, టిబెట్, జపాన్, కొరియా, సింగపూర్ దేశాలలోను, కొద్ది భాగం రష్యాలోను, వియత్నా అధిక భాగంలోను అనుసరించే బౌద్ధాన్ని స్థూలంగా క్రింది విభాగాలుగా విభజింపవచ్చును.


  • 'జెన్' లేదా 'చాన్' (Chan/Zen) - "ధ్యాన" అనే సంస్కృత పదం నుండి "చాన్" లేదా "జెన్" అనే చైనీయ పదాలు ఉద్భవించాయి. చైనా, జపాన్ దేశాలలో ఈ సంప్రదాయం బలంగా ఉంది. పేరును బట్టే జెన్ బౌద్ధంలో ధ్యానానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి జెన్ బౌద్ధులు శాస్త్రాల అధ్యయనానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అందరిలోనూ బుద్ధుడున్నాడు. ధ్యానం ద్వారా ఆ బుద్ధుని తెలిసికోవచ్చునని వీరి విశ్వాసం. ఇందులో మరిన్ని ఉపశాఖలున్నాయి. "రింజాయ్" జెన్ బౌద్ధులు తమ ధ్యానంలో "koan (meditative riddle or puzzle)" అనే సాధనాన్ని (యంత్రాన్ని) వాడుతారు. "సోటో" శాఖ జెన్ బౌద్ధులు కూడా ఈ యంత్రాన్ని వాడుతారు గాని "shikantaza అనగా కేవలం ఆసీనులై ధ్యానం చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం. ఈ జ్ఞానోదయం క్రమంగా అయ్యే విషయం కాదని, ధ్యానం ద్వారా మాయ తెరలు తొలగినపుడు ఒక్కమారుగా అత్మజ్ఞానం కలుగుతుందని సాధారణంగా జెన్ విశ్వాసాలు, ఆచరణా విధానాలు సూచిస్తాయి.
  • శుద్ధ భూమి (Pure Land Buddhism) - అధికంగా చైనాలో సామాన్య జనం ఆదరించే విధానం సాధన ద్వారా జ్ఞానం, నిర్వాణం సాధించే అవకాశం సామాన్యులకు కష్టం గనుక ఇతర విధానాల ద్వారా కూడ కొంత రక్షణ సాధ్యమని వీరి విశ్వాసం. జెన్ బౌద్ధులు స్వీయ సాధనను విశ్వసిస్తే, శుద్ధభూమి బౌద్ధులు "అమిద బుద్ధుడు" తమను కాపాడి జ్ఞానం వైపు నడిపిస్తాడని నమ్ముతారు. ప్రార్ధన, స్మరణం వంటి ప్రక్రియల ద్వారా అమితాభ బుద్ధుని "సుఖావతి" (సంతోష స్థానం) చేరుకోవచ్చునని వీరి విశ్వాసం. ఈ "స్వర్గ" సుఖమే నిర్వాణమని, లేదా నిర్వాణానికి ముందు ఘట్టమని (శాఖా భేదాలను బట్టి) నమ్ముతారు. సకల జీవులకూ సంసార బంధాలనుండి విముక్తి కలిగించడానికి కృత నిశ్చయుడైన అమితాభ బుద్ధుడు ఉన్నాడని, అచంచలమైన విశ్వాసం ఉంటే అది తప్పక సాధ్యమని వీరి భావం.

ఉత్తర (టిబెటన్) బౌద్ధం

డ్రెపాంగ్‌లో యువ బుద్ధ భిక్షువులు
టిబెట్‌లో అనుసరిస్తున్న బౌద్ధం ప్రధానంగా మహాయానం అయినప్పటికీ అందులో వజ్రయానం ప్రభావం గణనీయంగా ఉంది. మహాయానం ప్రాధమిక నియమాలకు అదనంగా చాలా ఆధ్యాత్మిక, భౌతిక సాధనలు టిబెటన్ బౌద్ధంలో ప్రముఖమైన అంశాలు. సాధనకు అనుకూలమయ్యేలాగా శరీరం యొక్క మరియు మనస్సు యొక్క శక్తులను పెంపొందించుకోవడం వల్ల సాధన త్వరగా సఫలమౌతుందని, ఒక్క జీవిత కాలంలోనే బుద్ధత్వము లభించే అవకాశం కూడా ఉన్నదని వారి విశ్వాసం. కనుక మహాయాన సిద్ధాంత శాస్త్ర్రాలే కాకుండా టిబెటన్ బౌద్ధులు వజ్ర యానానికి సంబంధించిన కొంత తంత్ర సాహిత్యాన్ని గుర్తిస్తారు. వీటిలో కొన్ని చైనా, జపాను దేశాలలోని పురాతన బౌద్ధ సాహిత్యంలో ఉన్నాయి. కొన్ని పాళీ రచనలలో కూడా కనిపిస్తాయి.

సమకాలీన బౌద్ధం

బౌద్ధానికి జన్మస్థానమైన భారతదేశంలో బౌద్ధం దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. పరిసర దేశాలలో బౌద్ధం బలంగా ఉన్నా గాని విచిత్రంగా ఆ ప్రభావం భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరణకు దోహదం చేయలేదు. ఇటీవలి కాలంలో తిరిగి బౌద్ధం కొంత పరిమితమైన ఆదరణ పొందుతున్నది. ప్రపంచం మొత్తం మీద బౌద్ధుల సంఖ్య అంచనాలు 23 కోట్లు - 50 కోట్లు మధ్య ఉంటున్నది. బహుశా 35 కోట్లు అనే సంఖ్య వాస్తవానికి దగ్గరలో ఉండవచ్చును. బౌద్ధ మతస్తుల సంఖ్య సరిగా అంచనా వేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
  • "బౌద్ధులు" అనగా ఎవరనే విషయం స్పష్టంగా నిర్వచింపబడకపోవడం;
  • బౌద్ధులలో సామూహిక ప్రార్ధనా సమావేశాలు, సామాజిక ఉత్సవాలు అంతగా లేనందున వారిని లెక్కించడం కష్టమవుతుంది.

  • చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఉన్న రాజకీయ పరిస్థితుల మూలంగా వ్యక్తుల మతాన్ని వ్వస్థీకృత విధానంలో గుర్తించడంలేదు.

కొరియాలో ఒక బౌద్ధ మందిరంలో అంతర్భాగం
ఒక అంచనా ప్రకారం క్రైస్తవ మతము, ఇస్లాం, హిందూమతం తరువాత ప్రపంచంలో నాలుగవ పెద్ద మతం బౌద్ధమతం.బుద్ధుని కాలంలో ప్రాంభమైన భిక్షువుల సంఘము ప్రపంచంలోఅత్యంత పురాతనమైన సాంఘిక సమూహము. ప్రపంచంలో ఆచరణలో ఉన్న ముఖ్య బౌద్ధమత విభాగాలు ఇలా ఉన్నాయి. 

  • పాళీ సూత్రాలపైన ఆధారపడిన థేరవాద బౌద్ధం - కంబోడియా, లావోస్, థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్‌లలో అధికంగా ఉంది. భారత దేశంలో బి.ఆర్. అంబేద్కర్ ఆరంభించిన దళిత బౌద్ధ ఉద్యమం కూడా ఈ విధానానికి సమీపంలో ఉంది.
  • చైనా భాషలో రచింపబడిన మహాయాన సూత్రాలను అనుసరించే తూర్పు ఆసియా దేశాలు - చైనా, జపాన్, కొరియా, తైవాన్, సింగపూర్, వియత్నాం.
  • టిబెటన్ భాషలోని సాహిత్యాన్ని, సంప్రదాయాలను అనుసరించే టిబెటన్ బౌద్ధం ఉన్న చోట్లు - టిబెట్ మరియు దాని పరిసర ప్రాంతాలు (భారత్, భూటాన్, మంగోలియా, నేపాల్, రష్యా)
  • పశ్చిమ దేశాలలో ఇటీవల కనిపిస్తున్న బౌద్ధ సమూహాలు ఈ తూర్పు దేశాలలోని మూడింటిలో ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తారు.
షుమారుగా థేరవాదులు 12.4 కోట్లు, చైనా మహాయాన బౌద్ధులు 18.5 కోట్లు, టిబెటన్ మహాయాన బౌద్ధులు 2 కోట్లు ఉండవచ్చునని ఒక అంచనా. 

కొన్ని ముఖ్య సిద్ధాంతాలు

థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు.అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం". 

బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.

బోధి

1వ శతాబ్దానికి చెందిన బుద్ధ ప్రతిమ - గాంధారం - ఉత్తర పాకిస్తాన్ (Guimet మ్యూజియం, పారిస్.
బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.

తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది. మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు. 


బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు.  అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు..

మధ్యేమార్గం

బౌద్ధ మతం సాంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి
  1. కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
  2. తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం[44]
  3. నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.

త్రిరత్నాల శరణు

ధర్మ చక్రం, త్రిరత్నాల చిహ్నాలతో గౌతమ బుద్ధుని పాద ముద్ర - 1వ శతాబ్దం గాంధార శిల్పం
సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు.  దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.

బుద్ధుడు
జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.
ధర్మము
బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము
సంఘము
బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.

"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.


మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.

నాలుగు మహోన్నత సత్యాలు

బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి 
  1. దుఃఖము
  2. దుఃఖానికి కారణము
  3. దుఃఖంనుండి విముక్తి
  4. దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు.  థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు. మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి.  దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.

అష్టాంగ మార్గం

ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు
నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)
శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:
  1. "సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
  2. "సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
  3. "సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.
  1. "సమ్యక్ సాధన" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
  2. "సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
  3. "సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.
  1. "సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
  2. "సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన.

తాత్విక భావాలు

పాళీ భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచం శాశ్వతమా, అశాశ్వతమా? ఆత్మ, శరీరం వేరు వేరా లేక ఒకటేనా? నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా? - ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికివచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన - అని ఒక అభిప్రాయం.  అంతే కాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం, ఆత్మ, వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు.

పాళీ సూత్రాలలోనూ, చాలా మహాయాన, తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది - వాస్తవం (సత్యం) సామాన్యమైన మనసుకు, వాదానికి అతీతమైనది. ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. "ప్రజ్ఞా పారమిత" సూత్రాలలో ఇది ఒక ప్రాధమిక అంశం. పఠనం, సాధన, ధ్యానం, విశ్వాసం, సూత్రాలపట్ల గౌరవం వంటి సాధనాల ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమమౌతుంది. నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే.

"మహాపరినిర్వాణ సూత్రం" లేదా "ఉత్తర తంత్రం" అనబడే మహాయానసూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవుసరమే కాని వాదాలు, శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞానానికీ, వీటికీ సంబంధం లేదు. ఇదే భావం చాలా తంత్రాలలోను, సిద్ధాంతాలలోను చెప్పబడింది. మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు. వివిధ శాఖలలో భేదాలున్నాగాని అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం (నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి) అనేది మాటలకు అతీతమైనది అని.

ధర్మ గ్రంధాలు

బౌద్ధమతం గ్రంధాలు అనేకాలు ఉన్నాయి. వీటిని అధ్యయన గ్రంధాలుగాను, కొందరు పూజార్హాలుగానూ కూడా చూస్తారు. ప్రధానంగా బౌద్ధ సూత్రాలు సంస్కృతంలో త్రిపిటకాలు (పాళీ భాషలో "తిపిటక") - అనగా మూడు బుట్టలు. అవి
  • వినయ పీఠకం - బౌద్ధ సంఘము, భిక్షువులు, భిక్షుణిల నియమాలు, విధానాలు గురించినది, అందుకు సంబంధించిన శాస్త్రాధారాలు, వివరణలు.
  • సుత్త పీఠకం - గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినవని చెప్పబడే సూత్రాలు
గ్రంధాలలో ఉన్న ప్రకారం గౌతమబుద్ధుని పరినిర్వాణానంతరం కొలది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశానికి మహాకాశ్యపుడు అనే బౌద్ధ భిక్షువు సభాధిపత్యం నిర్వహించాడు. ఈ మండలి లక్ష్యాలు - బుద్ధుని బోధనలను మననం చేయడం (సూత్రాలు లేదా సుత్త), సంఘాలలో పాటించవలసిన నియమాలను క్రమబద్ధం చేయడం (వినయం). గౌతమ బుద్ధుని సహచరుడు అయిన ఆనందుడు చెప్పిన విషయాలు సుత్త పిటకం అయ్యాయి. అభిధమ్మ, ఉపాలి అనే శిష్యులు చెప్పిన విషయాలు వినయ పిటకం, అభిధమ్మ పిటకం అయ్యాయి. ఈ పిటకాలు కొంతకాలం మౌఖికంగా ఇతరులకు సంక్రమించాయి. మరి కొంత కాలం తరువాత గాని గ్రంధస్తం కాలేదు. ఈ పిటకాలలో బుద్ధుని బోధనలు, జీవితంలో ఘటనలు, వేదాంత, శాస్త్ర సంవాదనలు, ఇతర నియమాలు అనేకం ఉన్నాయి.

థేరవాదులు, మరికొంత మంది ఆరంభ కాలపు బౌద్ధులు పాళీభాషలోని తమ గ్రంధాలు స్వయంగా బుద్ధుడు బోధించిన విషయాల సంగ్రహమేనని విశ్వసిస్తారు. థేరవాద సూత్ర గ్రంధాలలో షుమారు 40 లక్షల పదాలున్నాయి. "మహాయాన సూత్రాలు" వంటి ఇతర సూత్రాలు కూడా స్వయంగా బుద్ధుడే బోధించాడని, కాని అవి రహస్యంగా చెప్పబడడం వల్ల సామాన్యులకు తెలియలేదని ఆయా వాదులు విశ్వసిస్తారు. నాగులు, లేదా బోధిసత్వుల ద్వారా ఆ రహస్యాలు తరువాత అందుబాటులోకి వచ్చాయని వారి నమ్మకం. షుమారు 600 మహాయాన సూత్రాలు సంస్కృతం లేదా చైనా లేదా టిబెటన్ భాషలో ఇప్పుడు లభిస్తున్నాయి. మహాయాన సూత్రాలను థేరవాదులు విశ్వసించరు.

తెలుగునాట బౌద్ధం


ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్తూపాలున్న స్థలాలు.
బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. గుంటుపల్లి, భట్టిప్రోలు వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది. భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించారు. రాజుల హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్తానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో వేంగిదేశం ముఖ్యమైన మార్గం మరియు కూడలిగా ఉండేది. తరువాత మహాయానం ఆంధ్రదేశంలోని నాగార్జునుని తత్వంతో ప్రావర్భవించింది. ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు.
భట్టిప్రోలు శిలా మంజూషికల నమూనాలు

చిహ్నాలు

మహాయాన బౌద్ధం, వజ్రాయన బౌద్ధం లో ఎనిమిది శుభసూచకమైన చిహ్నాలున్నాయి.
  • ఛత్రము (గొడుగు గుర్తు)
  • బంగారు చేప
  • the Treasure Vase
  • పద్మము
  • శంఖము
  • the Endless Knot
  • ధ్వజం
  • ధర్మ చక్రం