బుద్ధుని మధ్యమ సంభాషణలు
మానవుణ్ణి దుఃఖం నుండి విముక్తుణ్ణి చేయడానికి బుద్ధుడు చేసిన తాత్విక, తార్కిక సంభాషణల సంపుటే ఈ పుస్తకం. ఉదాహరణకు 'సర్వాసవ సూత్తం'లో అంటే అన్ని ఆసవాల (కాలుష్యాల) గురించిన సూత్రంలో ఎటువంటి మనిషిని కాలుష్యాలు అంటుతాయి? ఎవరిని అంటవు? వాటిని వదిలించుకోవడమెలా? అన్న అంశాల గురించి చర్చ ఉంది. జ్ఞానంతో కూడిన అవధానం (wise attention), అజ్ఞానంతో కూడిన అవధానం (unwise attentiong) అనే రెండింటితో మనిషి సంచరిస్తూ ఉంటాడని, ఒకడు అజ్ఞానంతో కూడిన అవధానంలో ఉన్నట్లయితే అతనిలో అంతకుముందే ఉన్న కాలుష్యాలకు మరికొన్ని చేరుతాయి అని చెప్పబడింది. ఈ కాలుష్యాల్ని చూడడం ద్వారా, భరించడం ద్వారా, పరిత్యజించడం ద్వారా, భావన చేయడం ద్వారా వదిలివేయాల్సి ఉంటుందని చెబుతాడు బుద్ధుడు. ఒక భిక్షు ఈ రకంగా చేసినపుడు అతడు 'సర్వాసవని గ్రహభిక్షు'గా మారతాడు. తృష్ణను, బంధనాలను తెంచుకుని, గర్వాన్ని అంతమొందించుకోవడంతో అతడు దుఃఖానికి అంతం పలుకుతాడు.
ఈ రకంగా కళంకాలు, శిక్షణ, క్షాళన ప్రక్రియ, సమ్యగ్దృష్టి, నిర్వాణ సాక్షాత్కారం, ధ్యానం, జ్ఞానోదయం వంటి యాభై అంశాల గురించి ఉపమానాలతో కూడిన కథల ద్వారా సాగిన సంభాషణలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. బుద్ధుని మధ్యమ సంభాషణలు బౌద్ధాభిమానులకే కాక, సత్యాన్వేషకులందరికీ అందుబాటులోకి రావడంలో అనువాదకుని కృషి ఎంతో గుర్తించదగింది.
- కాకుమాని శ్రీనివాసరావు
బుద్ధుని మధ్యమ సంభాషణలు,
అనువాదం : అన్నపరెడ్డి బుద్ధఘోషుడు
పేజీలు : 351, వెల : రూ. 200/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
బౌద్ధ టూరిజానికి బెస్ట్ గైడ్
బౌద్ధం గురించిన పరిశోధనతో పాటు ఆ మత పరిచయం కూడా ఉంటుందీ గ్రంథంలో. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో బౌద్ధ యుగం గురించి వివరిస్తూ, బౌద్ధ ధర్మ విశిష్టతను పేర్కొంటూ బౌద్ధానికి సాహిత్యం తోటి, కళలతోటి, భాషతోటి ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. బౌద్ధ తాత్వికులను పరిచయం చేస్తూ బౌద్ధ ఉత్థాన పతనాలను పేర్కొంటూ ముగిస్తారు రాంబాబు. ఈ ఆల్ ఇన్ వన్ గైడ్‌లో భాష కూడా సరళంగా ఉంది. బౌద్ధం మీద విస్తృత పరిశోధనలు చేసిన అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముందుమాటలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధం గురించి సమగ్రంగా చర్చిస్తూ తెలుగులో వచ్చిన గ్రంథమిది.
ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం, పి. రాంబాబు
పేజీలు : 478, వెల : రూ. 300/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
వినయ పిటకము
ధమ్మపదం
వినయపిటకము, పేజీలు : 530, వెల : రూ. 300/-
ధమ్మపదం, పేజీలు : 82, వెల : రూ. 30/-,
అనువాదం : మోక్షానందస్వామి,
ప్రతులకు : మోక్షానందాశ్రమము, తిమ్మాపూర్,
నిజామాబాద్ జిల్లా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి