10, జులై 2013, బుధవారం

బహుబలి

బహుబలి
మనదేశం భిన్నమతాలకు ఆలవాలం హైందవ, ముస్లిం,కైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతులు ఈ నేలలో ఫరిఢవిల్లారు. చారిత్రక కట్టడాల రూపంలో సంస్కృతుల చిహ్నాలు... దేశవ్యాప్తంగా నేడు ప్రసిద్ధ పర్యాటక ేకంద్రాలుగా వెలుగొందుతున్నారు. వందల, వేల ఏళ్ళనాడే భారతావనిలో జైన మతం విశేష ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక రాషాట్రల్లో అనేక దేవాలయాలు, సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తారుు. అలాంటి వాటిలో పేరెన్నికగన్నదే ‘శ్రావణ బెళగొళ’... దేశంలోనే పెద్దదైన ‘బాహుబలి’ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జైన సంస్కృతీ సంపదను కళ్ళకు కడుతున్న కర్ణాటకలోని ‘శ్రావణ బెళగొళ’ విశేషాలు...

 
రెండు కొండల మధ్య ప్రృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్యాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను ‘శ్రమణ బెళగొళ’ అనేవారు. క్రమంగా ‘శ్రావణ బెళగొళ’గా మారింది. స్థానికులు ‘బెళగొళ’ అనే పిలుస్తారు. చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.
భారీ గోమఠేశ్వరుడు
ఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్రహాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిందే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతాం.
కనులకు విందు... మస్తకాభిషేకం
12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్‌, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్‌ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కొంచెం కష్టమే. మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల తరువాత కొండపైకి చేరుకుంటారు....

బాహుబలి చరిత్ర :
 
గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.
జైన విశిష్టత :
 
మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.
అంతా శాసనాలమయం
బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్‌ స్టోన్స్‌ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు. ఇందులో చిన్న కొండ మీద 271,ె పద్ద కొండ మీద 172, 80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్ని కూడా క్రీశ 600-19వ శతాబ్దం మధ్యనాటివే. లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి.
ఇలా వెళ్లాలి :
 
శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవే రూట్‌లో వస్తుంది. రైల్వే ద్వారా చేరాలంటే హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక విమానయానం ద్వారా వచ్చే ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా చేరాలి. యాత్రికులు బెళగొళలో పర్యటించడానికి అవసరమైన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ ఉన్న జైనమఠం అడ్రస్‌లో సంప్రదించవచ్చు.

తవాంగ్‌ స్ధూపం

తవాంగ్‌  బౌద్ధ స్ధూపం
budda  అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వద్ద ఉన్న ది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాం గ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాం గ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలో కి గతంలో కలుపు కున్నప్పటికీ 2007లో అది తమదేనంటూ చైనా వివాదాన్ని లేవ దీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించా డన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. బ్రిటీష్‌ వారు పోతూపోతూ భారత్‌ - చైనాలు విభజించ టానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దు గా మార్చారు. దానితో తవాంగ్‌ మఠం మనకు దక్కింది. అయిన ప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు తమవేనంటూ చైనా వాదిస్తోం ది. ఒకప్పుడు ఈ ప్రాంతా న్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు. ఇప్పటిదాకా ఉన్న రికార్డు ప్రకారం తవాంగ్‌ 1951 వరకూ టిబెట్‌ ప్రభుత్వ హయాంలో ఉండేది.

స్థానిక అరుణాచల వాసులు వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ నిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు. తవాంగ్‌ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గా లుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్‌. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవ చ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు భద్రపరి చారు. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు, విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు.

ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్‌ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుం టారు. టిబెట్‌ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు. తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్‌ వస్తుంది . ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్‌. తేజ్‌పూర్‌ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది

భట్టిప్రోలు

బౌద్ధం పరిఢవిల్లిన... భట్టిప్రోలు
రాష్ట్ర చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమైన భట్టిప్రోలుది విశిష్టస్థానం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ బౌద్ధారామాలలో ఒకటిగా కీర్తించబడుతున్న బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. క్రీపూ 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం... భవననిర్మాణ రీతుల్లోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నారుు. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు దర్శించినట్టుగా చెప్పబడుతున్న గుంటూరు జిల్లాలోని ఆ అద్భుత చారిత్రక క్షేత్రం ‘భట్టిప్రోలు’ వైశిష్ట్యం .

Bhataభట్టిప్రోలు ప్రాచీననామం ప్రతీపాలపురం. ఆంధ్ర శాతవాహనుల కాలానికి పూర్వం నుండే ఉన్న ప్రముఖ నగరం ఇది. సారవంతమైన కృష్ణానది మైదానంలో... సముద్ర తీరానికి సమీపానగల ఈ ప్రాచీన నగరం... అక్కడ తవ్వకాలలో బయటపడిన బౌద్ధ స్థూపం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. భట్టిప్రోలుకు సమీపంలో ఉన్న పోతవరలంక వరకు పెద్ద పడవలు, నౌకలు వచ్చేవనీ, అక్కడి నుండి వరి ధాన్యము, దినుసులు, వస్త్రాలు ఎగుమతి అవుతుండేవనీ, జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రంగా ఈ నగరం విరాజిల్లిందని చరిత్రకారుల అభిప్రాయం.

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్ర ఇలా భట్టిప్రోలు అనేక పేర్లున్నాయి. క్రీశ 8వ శతాబ్దానికి చెందిన జైనకవి నయసేనాని వ్రాసిన ‘ధర్మామృత’ కావ్యంలో ప్రతీపాలపురం ప్రసక్తి ఉంది. ఇది క్రీశ 5వ శతాబ్దంలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఇతని వారసుడు ధనదుడు జైన మతాన్ని వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసు కుంటాడు. ఈ కథ బృహత్కథాకోశంలో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో ‘కుబీరక’ రాజు ప్రసక్తి ఉంది. ధనదుడి కి కుభీరక, కుబేర అనే పేర్లు కూడా ఉన్నాయి.

జైన రాజైన ఖారవేలుడు పితుడ్రనగరంలోని బౌద్ధక్షేత్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ‘ఖారవేలు’ని శాసనాల్లో చెప్పబడినది. ఆ శాసనాల్లో పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.

చారిత్రక శిథిలాలు...
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులకంటే విదేశీయులే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. క్రీశ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్ట్‌ సెవెల్‌ అనే విదేశీయులు భట్టిప్రోలును సందర్శించారు. 1892లో అలెగ్జాండర్‌ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరపును ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. అప్పుడు ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీపూ 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది.

లాంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్థూపం, కోట గోడలు కనపడ్డాయట. స్థూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదరపు స్థంభాలు, ఆయక వేదికలు, చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్థంభం ఎత్తు 15 అడుగులు. వాటిపై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి వున్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది. ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు, ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించిందని చెబుతారు.

భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన ‘మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని ‘శ్రీధర్మరాజిక విహార్‌’లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంతటి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం విచిత్రం.

స్థూప విశిష్టత...
Bhattiaభట్టిప్రోలు స్థూపాన్ని ధాతుగర్భం అంటారు. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది అని అర్థం. శాసనాల్లోని ‘బుద్ధ శరీరాని నిఖేతుం’, ‘బుద్ధ శరీరాని మహనీయాని కమ్మనే’ అనే వాక్యాలనుబట్టి స్థూపం యదార్ధమైన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టమవుతోంది. స్థూపం మధ్య రంధ్రం ఉన్నది. రంధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్థూపం పైన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రం గుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.ఆంధ్రులు ఒక విశిష్టమైన స్థూప నిర్మాణశైలిని అభివృద్ధి చేశారు.

ఇందు ఆయక స్థంభాలు ప్రధానమైన సాక్ష్యాలుగా నిలు స్తున్నాయి. చక్రాకార స్థూపనిర్మాణం భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్థూపాల్లో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్థూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం, ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్థూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలుగా చెబుతారు.

భాష, లిపి...
స్థూపంలో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నీ ఈ లిపినుండే పరిణామం చెందాయి. బౌద్ధమతంతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణాసియా ఖండంలో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లావోస్‌, కంబోడియా మొదలైన భాషలకు లిపి ప్రదానం చేసింది.తెలుగు దక్షిణ భాషా కుటుంబా నికి మూలం ద్రవిడం. దీనినుండి క్రీపూ 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించు కుందని పండితుల అభిప్రాయం. నేటి తెలుగు లిపికి ‘మాతృక’గా పరిణామక్రమం లో మొదటిదిగా ‘భట్టిప్రోలు లిపి’ ని పేర్కొంటారు.

స్థూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనదిగా చెబుతారు. భాషా పరిశోధకుల ఆభి ప్రాయం ప్రకారం ఈ లిపి క్రీపూ500 కాలంలో అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణాపధంలో క్రీపూ300 నాటికి భట్టిప్రోలులో ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపించే రూపం సంతరించుకొంది. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి.

ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాలా వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణాలు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కనిపించిన ‘ళ’ ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. ఇంతటి చారిత్రక వైభవం కలిగిన భట్టిప్రోలు మనకు ప్రాచీనులు అందించిన జ్ఞానభండాగారమని చెప్పకతప్పదు.

శాసనాలు...
భట్టిప్రోలు శాసనాల్లోని భాష... ప్రాకృతం, లిపి... బ్రాహ్మీ భేదము. రాతిపేటికలు, స్ఫటికపు మంజూ షిక, వెండిరేకు, స్ఫటికపు పూసపైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనాల వల్ల స్థానిక సభ దానధర్మాల్లో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ (నాలుగవ పేటిక). గోష్టి సభ్యులందరి పేర్లూ ఇందులో ఉన్నాయి. సింహగోష్ఠి అధ్యక్షుడు కుభీరకుడు (కుబేర, కుభిరక, కుభిర). బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేసేందుకు ‘కుర’ అనే అతడు పేటిక చేయించాడు (మూడవ పేటిక). ఐదవ పేటిక శాసనంలో ‘రాజా కుబేరక’ అని ఉంది.

కొండల్లో .....బౌద్ధం

కొండల్లో అలరారిన బౌద్ధం
భారతదేశంలో బౌద్ధమతానికి సంబంధించిన ఆరామాలు, చైత్యాలు, విహారాలు అనేకం ఉన్నారుు. మనరాష్ట్రంలో కూడా వీటి సంఖ్య ఎక్కువే... అమరావతి, గుంటుపల్లి వంటి అనేక బౌద్ధ క్షేత్రాలున్నారుు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఇలాంటి బౌద్ధ క్షేత్రాలకు కొదువలేదు. వాటిలో అత్యంత పురాతన, ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన మూడు బౌద్ధ క్షేత్రాలే... పావురాళ్ళకొండ, బావికొండ, తొట్లకొండ... ఈ విశిష్ట బౌద్ధ విహారాల సమహారామే ఈవారం ‘విహారి’...

బావికొండ బౌద్ధవిహారం
విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉన్నది బావికొండ బౌద్ధ సముదాయం. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దానికి చెందినది. ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయటపడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.


తొట్లకొండ
బౌద్ధమతంపై పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్న రోజులవి. అంటే సుమారు రెండువేల సంవత్సరాల క్రితం. భీమిలి కేంద్రానికి సమీపంలో బౌద్ధరామం నిర్మించారు. ఈ బౌద్ధరామం ఉన్న ప్రాంతం నేడు తొట్లకొండగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ తొట్లకొండ బౌద్ధ సముదాయం కూడా విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో, భీమునిపట్నం బీచ్‌కు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల లోపల తిమ్మాపురం ప్రాంతానికి ఆగ్నేయ దిశలో ఈ ప్రాంతం ఉంది.

ఈ దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తయిన ఒక కొండపై ఉన్నది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటం వలన తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక, తదితర ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది.

సముద్ర తీరానికి అతి చేరువలో లోతైన గుహాలు కలిగివున్న ప్రాంతం, ప్రకృతి సౌందర్యానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. మానవాళి మెచ్చుకునే ఈ తొట్లకొండ నాటి బౌద్ధమతావలంబీకులను ఎంతో ఆకర్షించేదట. అందుకే అప్పట్లో వారంతా ఈ కొండను విహారకేంద్రంగా భావించేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి లోతనైన సముద్రతీరం నౌకలకు లంగరు వేయడానికి అనువుగా తోడ్పడేది. తూర్పు తీరంలో తగిన నావికా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం భారత నౌకాదలం ఏరియల్‌ సర్వే నిర్వహింస్తున్న సందర్భంలో నేటి తొట్లకొండ ప్రత్యేకంగా కనిపించింది. అనంతరకాలంలో ఇక్కడ బౌద్ధరామం ఉన్నట్లు కనుగొన్నారు.

ఆ తరువాత కాలంలో ఆర్కియాలజీ, మ్యూజియం శాఖలు దీనిపై అనేక పరిశోధనలు నిర్వహించి ధెరనాడ (హీన యాన బౌద్ధమతం)కు చెందిన ఆయలంగా గుర్తించారు. నాటి రాతి రహదారులు, అనేక చైతన్య గృహాలు, వంటశాలు, భోజనశాలలు చరిత్రకు సాక్షాలుగా నిలిచాయి. ఈ ఆనవాళ్లుతో పాటు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి పరికరాలు, పనిముట్లు, రాతి బోమ్మలు, రాతి స్థూపాలు, శాతవాహన, వెండి నాణేలు లభించాయి. ఈ ఆనవాళ్లు ఆధారంగానే తొట్లకొండపై నాడు బౌద్ధరామం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడి నిర్మాణాలు కేవలం క్రీస్తు పూర్వ మూడో శతాబ్ధం నుంచి క్రీస్తు శకం మూడో దశాబ్ధం మధ్య కాలంలోనే జరిగాయని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీస్తు శకం మూడో దశాబ్ధం నుంచి హీన యాన బౌద్ధ మత ప్రభావం తగ్గడంతో బౌద్ధరామ శిల్పాలు మరుగున పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ నీటిని నిల్వచేసే భారీ తొట్లెలు కనిపిస్తాయి. బౌద్ధులకు చెందిన స్థూపాలు, చెత్య గృహాలు, సమావేశ మందిరాలు వంటి వాటికి చెందిన అవశేషాలు ఇక్కడి తవ్వకాల్లో వెలుగుచూశాయి.

బీచ్‌ తీరం వెంబడి భీమిలికి వెళ్ళే దారిలో కైలాసగిరి, ఋషికొండ సాగర్‌నగర్‌, గీతమ్స్‌, రిసార్ట్లు, కొత్తగా కడుతున్న రామానాయుడు స్టూడియో దాటాకా తొట్లకొండ వస్తుంది. కొంత దూరం పైకి వెళ్ళగానే కుడిపక్కన మనవాళ్ళు నిర్మించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం, దాని ముందు చిన్న ఫౌంటైన్‌ కనిపిస్తాయి. కోండపైకి వెళితే అక్కడ ఒక హోర్డింగ్‌ కనిపిస్తుంది. దాని మీద ప్రదేశం గురించిన వివరాలు మ్యాప్‌తో సహా ఉంటాయి. ఆ మ్యాపులో చూపించిన చైత్యాలు, స్తూపాలు, సముదాయాలు అన్నీ (అంటే శిథిలాలు) కనిపించవు. ఓ పావు భాగం మాత్రమే మనం చూడగలుగుతాం.

చారిత్రక బౌద్ధ క్షేత్రాలకు నిలయమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని సాధిస్తున్న తొట్లకొండ భారతదేశంలోనే సుప్రసిద్దమైన బౌద్ద క్షేత్రంగా పేరుగాంచింది. సాగరతీరంలో వెలసిన ఏకైక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను మిక్కిలి ప్రజాదరణ కలిగిన సందర్శనా స్థలంగా తీర్చిదిద్దాలంటూ బెంగుళూరు కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్న మహాబోధి సొసైటీ ప్రతినిధులు కొన్నాళ్ళక్రితం వుడా విసిని కలిసి ప్రతిపాదన సమర్పించారు.

బౌద్ధ సాంస్కృతిక కేంద్రం, ధ్యానకేంద్రం, బౌద్ధ పరిశోధనా కేంద్రం, బౌద్ధారామాన్ని పోలిన విశేషాలు, థీమ్‌ పార్క్‌, వీటన్నింటికీ తోడు ప్రకృతిని సాక్షాత్కరింపజేసే పచ్చదనాన్ని పెంపొందించడం వంటి కార్యాచరణ ప్రణాళికల్ని ప్రతిపాదనలో చేర్చారు. హైదరాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార తరహాలో తొట్లకొండను సమగ్రంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రముఖ సందర్శనా స్థలంగా మార్చనున్నారు. వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న తొట్లకొండపై మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా సందర్శకులు అధిక సంఖ్యలో రాలేకపోతున్నారనేది
వాస్తవం.


పావురాళ్ళకొండ
స్థానికంగా నరసింహస్వామి కొండగా పిలుచుకునే పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు విశాఖపట్టణానికి 25 కిలోమీటర్లు ఉత్తరాన భీమునిపట్నం వద్ద ఉన్నది. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉన్నది. బౌద్ధ విహారం యొక్క శిధిలాలు అనేక ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దం నుండి క్రీస్తుశకం రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి.
1990-91లో జరిగిన తొలివిడత తవ్వకా ల్లో అనేక అవశేషాలు లభ్యమయ్యాయి. రెండు బ్రాహ్మీ లిపి సూచక శాసనాలు, విహారాల యొక్క పునాదులు, వృత్తాకార చైత్యాలు, మొక్కుబడి స్థూపాలు, హాలులు తదితరాలు ఈ శిధిలావస్థలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ ప్రదేశం నుండి నాణేలు, మెరుగుబెట్టిన పాత్రలు, పూసలు మొదలైన వస్తువులను సేకరించారు. ఈ కొండపై వర్షపునీటిని నిలువచేసుకోవటానికి రాతిలో చెక్కిన దాదాపు పదహారు తొట్లను కనుగొన్నారు. ఇలాంటి తొట్ల వల్లే పేరు సంతరించుకొన్న బావికొండ, తొట్లకొండల కంటే ఎక్కువ తొట్లు ఇక్కడే ఉండటం విశేషం.
ఈ క్షేత్రానికి సమీపంలో గోస్తనీ నది ప్రవహిస్తున్నది. ఇక్కడి నుండి సముద్రతీరం దృశ్యం కూడా అందంగా ఉంటుంది. విశా ఖపట్నం జిల్లాలోని ఇతర బౌద్ధ క్షేత్రాలైన బావికొండ, తొట్లకొండలకు పావురాళ్ళ కొండ క్షేత్రం కూడా సమకాలీనమైనది.
2012 వేసవిలో జరిగిన తవ్వకాల్లో ఒక విహారం, ఒక వరండా ఇక్కడ బయల్ప డ్డాయి. బౌద్ధ క్షేత్రాలలో తరచుగా కనిపించే అర్ధచంద్రాకారపు శిలలు విహారాలలో అడుగుపెట్టే స్థలంలో స్వాగతం పలుకుతు న్నాయి. ఒక నాగ శిల్పం, ధాన్యం నిలువ చేసుకోవటానికి ఉపయోగించిన ఒక పెద్ద కుండ, చిన్నకుండ, శిలాస్థంబాల మండ పాలు, అవశేషపు భోషాణం, ఒక రోమన్‌ నాణేం, రెండు శాతవాహన నాణేలు, పుష్ప ఫలకాలు ఇప్పటివరకు లభ్యమైన వస్తువుల లో కొన్ని. తీరానికి దగ్గర ఉండటం వళ్ల ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలతోనే కాక విదేశాలతో కూడా వర్తక సంభందాలు ఉండేవని తెలుస్తున్నది.
ఈ చారిత్రక స్థలం డచ్చి వారి అతిధిగృహం నిర్మించడం వళ్ల పాక్షికంగా మార్పుచెందినది. జీర్ణావస్థలో ఉన్న అతిధిగృహంలో ఎలాంటి శాసనాలు దొరకలేదు. కానీ గోడ లు మాత్రం పటిష్టంగానే ఉన్నాయి. బౌద్ధ క్షేత్ర నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు ఈ డచ్చి అతిధిగృహం నిర్మాణం లో పునరుపయోగించినట్టు తెలుస్తున్నది.
పావురాళ్ళకొండలో ఇప్పటివరకు నాలుగు శాసనాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దానికి చెందినదైతే మిగిలిన మూడు శాసనాలు క్రీస్తుశకం ఒకటి నుండి రెండవ శతాబ్దానికి చెందినవి. చివరి మూడింట్లో ఒకటి పాల అనే గ్రామవాసులు బౌద్ధ ఆరామానికి ఛత్రం, తొట్టి మరియు మండపం దానం చేసిన విషయం ప్రస్తావిస్తుంది. మిగిలినవి అనేక బౌద్ధ సన్యాసుల పేర్లు పేర్కొంటున్నవి.
పావురాళ్ళకొండ అనగానే పావురాలు ఉండే కొండ అని అనుకోవటం పరిపాటే కానీ ఈ కొండపై జరిపిన కొన్ని అధ్యయనాల వల్ల ఇక్కడ లభ్యమయ్యే తెల్ల రాళ్లను స్థానికులు పావురాళ్ళు అంటారు. అవి కొండపై ఉండటం వళ్ల పావురాళ్ళకొండ అయి ఉండవచ్చు. అయితే ఈ పేరు వ్యవహారం మరింతగా పరిశోధించవలసి ఉన్నది.

శాలిహుండం

శాలిహుండం
ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్‌.లాంగ్‌హర్ట్‌‌స, టి.ఎన్‌.రామచంద్రన్‌, ఆర్‌.సుబ్రహ్మణ్యన్‌ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.