తవాంగ్ బౌద్ధ స్ధూపం
స్థానిక అరుణాచల వాసులు వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ నిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు. తవాంగ్ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గా లుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవ చ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు భద్రపరి చారు. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు, విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు.
ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుం టారు. టిబెట్ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు. తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్ వస్తుంది . ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్. తేజ్‌పూర్ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి