28, జనవరి 2013, సోమవారం

బుద్ధుని ప్రతిమలు


బుద్ధుడు ఎన్ని రకాలో!

 ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అంటూ మానవజాతికి సత్యాన్ని బోధించిన గౌతమ బుద్ధుని ప్రతిమలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యిరకాలుగా ఉన్నాయి. ధ్యానముద్ర, ధర్మచక్ర ప్రవర్తన ముద్ర, అభయముద్ర, భూ స్పర్శముద్ర, మహాపరినిర్యాణ ముద్ర, సుఖాసీన ముద్ర, వాకింగ్‌ ముద్ర, లాఫింగ్‌ ముద్ర తదితర ప్రతిమలు ఉన్నాయి. ఖేరవాదం, మహాయానం, వజ్రయానం అనే మూడు దశల్లో బౌద్ధమతం వ్యాపించింది. ఖేరవాదంలో కేవలం బుద్ధుని వచనాన్ని మాత్రమే ప్రమాణీకంగా తీసుకుని ఆచరించే వారు. బుద్ధుని చిహ్నలను మాత్రమే కొలచే ఈ వాదంప్రకారం బౌద్ధబిక్షులు వారికి మాత్రమే బౌద్ధాన్ని అనున్వయించుకుంటూ నిర్యాణాన్ని పొందేవారు. బుద్ధుని మహాభినిష్క్రమణ ను గుర్రంతోనూ, సంబోధి పొందడాన్ని బోధవృక్షంతోనూ, ధర్మచక్రప్రవర్తనం ను జింకలతోనూ, మహాపరినిర్యాణాన్ని స్తూపం చిహ్నం తోనూ కొలచేవారు. ఆ తరువాత మహాయానంలో బుద్ధుని ఆరాధన ప్రారంభమై వివిధ రూపాల్లో బుద్ధుని విగ్రహలు రూపుదాల్చాయి. క్రీ.శ. 1 నుంచే బుద్ధిని విగ్రహారాధన ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ విగ్రహాలు ముఖ్యంగా మూడు శైలిల్లో ఉండేవి. గాంధార శైలీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బుద్ధుని ప్రతిమలన్నీ ఈ శైలీకే చెందుతాయి. గ్రీక్‌ లో లభ్యమైన బుద్ధునిరూపం మీసాలతో కనిపిస్తుంది.

మధుర శైలి
ఉత్తర భారతదేశంలో లభ్యమైన, ప్రస్తుతం ఆధారిస్తున్న బుద్ధప్రతిమలన్నీ ఈ రకానికి చెందినవి. సహజ సుందర మూర్తి, ఉబ్బెత్తు ప్రతిమలు కనిపిస్తాయి. శాంచీ, గయ, సార్‌నాథ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు ఇందుకు ఉదాహరణ.

అమరావతి శైలి
దక్షణ భారతదేశంలో లభించిన బుద్ధుని ప్రతిమలు ఈ రకానికి చెందినవి. 1924, 1926, 1928 సంవత్సరాల్లో జరిగిన తవ్వకాల్లో నాగార్జునకొండ లో లభించిన విగ్రహాలన్నీ అమరావతి శైలీలో ఉన్నవే. కుడిభుజంపై వస్త్రం లేకుండా, ఎడమభుజంమీదుగా వచ్చిన వస్త్రం శరీరదిగువ భాగాన్ని కప్పబడినట్లు, బిగించిన ఎడమచేయి పైకెత్తి పట్టినట్లుగా ఈ విగ్రహాలు ఉంటాయి.

 



నాలుగు సంకల్పాలు


నాలుగు  సంకల్పాలు
 
దివ్య జనని శారదా మాత ఒక విలువైన మాటను ఎల్లపుడూ చెప్పేవారు. మనిషి అత్యంత జాగ్రత్తగా జీవించాలి. అతని ప్రతి సంకల్పమూ, చర్యా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సంకల్పాలు చర్యలు అనేవాటివల్లె మనిషి మనస్సులో వాసనలు కలుగుతాయి. ఈ వాసనా బలమే తరువాత అతడు మంచి లోకాలలో జన్మిస్తాడా లేక అధమ లోకాలలో జన్మిస్తాడా, మంచి పుట్టుక కలుగుతుందా లేక నీచమైన పుట్టుక కలుగుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రతి వానికి తానూ మంచి కుటుంబంలో పుట్టాలి తనకు అంతా మంచే జరగాలి అనే ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం? తన పూర్వ కర్మలు తన ఆలోచనలు సంకల్పాలు చర్యలు ఇవే కారణం.
అంతిమంగా మన భావనలే మన మిత్రులు అవే మన శత్రువులు. యోగ వేదాంత శాస్త్రముల ప్రకారం మనిషి యొక్క భావనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది.

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత
ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు ఎల్లరి యందూ చూపించేలా అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్తితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా
మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ
గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.
సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తానూ కూడా సంతోషం పొందటాన్ని ముదిత అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వములను సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి
వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్తితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్తితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్తితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్తితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని "
దీర్ఘ నికాయం " లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. " తేవిజ్జ సూత్ర " అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని " విశుద్ది మార్గం " లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.
ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.

"పాపం - పుణ్యం - జ్ఞానం"


"పాపం - పుణ్యం - జ్ఞానం" 
ధమ్మపదం లో
బుద్ధుడు చెప్పాడు
"ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి . .
ఇథ మోదతి, పెచ్చ మోదతి, కతపుజ్ఞ ఉభయత్థ మోదతి" (పాళీ భాష)

"పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;
పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు"

పాపం            =                 అజ్ఞానం, అధర్మాచరణం వలన
పుణ్యం           =                 ధర్మాచరణం వలన
దివ్యజ్ఞానం       =                 ధ్యానం వలన
         
అధర్మాచరణ వలన ఈ లోకం లోనూ, పరలోకాల్లోనూ,
దుఃఖప్రాప్తి, మరి తిరిగి జననం కలుగుతాయి;
ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ,
సుఖప్రాప్తి లభిస్తుంది;
అయితే, తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది
"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అన్నారు కదా గీతాచార్యులు కానీ,
దివ్యజ్ఞానప్రకాశం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ
అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్యస్థితి కూడా లభిస్తుంది 
  • కనుక, మన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ,మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞానప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి;అలా జీవితం మొత్తం గడపాలి; అదే సరియైన జీవితం

సన్మార్గ దార్శనికుడు


గౌతమ బుద్ధుడు సన్మార్గ దార్శనికుడు
  ఆయన తనకు తాను దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు. అవతార పురుషుణ్ణని ఎవరినీ నమ్మించలేదు. ఎటువంటి మహిమలూ చూపించలేదు. అయితేనేం ఆయన కన్నుల్లో కరుణ, పలుకులో ప్రేమ ఉట్టిపడుతుంటాయి. ఆయనే గౌతమ బుద్ధుడు. సకల సుఖాలను అనుభవించగలిగే రాజకుటుంబంలో పుట్టినా, సర్వమానవ సంక్షేమం కోసం, మానవులందరినీ దుఃఖ విముక్తులను చేయడం కోసం వాటన్నింటినీ తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలత, తనలో నిండిన జ్ఞానజ్యోతులను అందరిలోనూ వెలిగించాలనే తృష్ణ ఆయనను భగవానుడిగా మార్చాయి. 



 

గౌతముడు క్రీ.పూ 563లో రాజకుటుంబంలో పుట్టాడు. సిద్ధార్థుడికి చిన్నప్పటి నుండి తాత్త్విక చింతన మెండుగా ఉండేది. ఏ ప్రాణికి ముప్పు కలిగినా, బాధ కలిగినా సహించేవాడు కాదు. అది గమనించిన గౌతముని తండ్రి శుద్ధోధనుడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో గౌతముడిని పెంచాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గౌతముడి తాతగారు వయోభారంతో అస్వస్థతకు గురవడం, క్రమంగా క్షీణించి చివరికి మరణించడం... గౌతముడిలో తిరిగి చావుపుట్టుకల గురించిన సందిగ్ధం, సంఘర్షణకు కారణమయ్యాయి. ఈ అన్వేషణలో భాగంగా దేశాటన చేశాడు. నాలుగు దఫాలుగా రాజ్యం నాలుగు దిక్కులూ పర్యటించాడు.

మూడుసార్లు గౌతముడికి రాజ్యంలో ప్రజల బాధలు, రోగాలు, మరణాలు వంటివే కనిపించాయి. ‘‘ప్రపంచం ఇంతటి విషాదంలో నిండి ఉంటే నేను వైభవోపేతమైన జీవితాన్ని అనుభవించడం ధర్మమేనా?’’ అనే ఆలోచన గౌతముని మదిలో మెదలసాగింది. ఈ నేపథ్యంలో సాగిన నాలుగో పర్యటనలో ఒక సన్యాసిని చూడడం తటస్థించింది. గౌతముడికి సమాధానం అప్పుడు దొరికింది. అప్పటి వరకు అతడి మనోసాగరంలో జరిగిన అలజడి సన్యాసి దర్శనంతో నెమ్మదించసాగింది. ఆలోచనలకు ఒక రూపం రాసాగింది. చివరికి తన 29వ ఏట అంతఃపురాన్ని వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి గౌతముడి శోధన సత్యాన్వేషణకే జరిగింది. ఆ శోధనలో అనేక అంశాలను సంగ్రహించాడు.జీవించడానికి అనుసరించాల్సిన త్రిరత్నాలను బోధించాడు. అవి...

‘బుద్ధం శరణం గచ్ఛామి’
(బుద్ధి మనసుకు దారి చూపించే మార్గదర్శి)
‘ధర్మం శరణం గచ్ఛామి’
(ధర్మం అనేది మనిషి నడవాల్సిన దారి)
‘సంఘం శరణం గచ్ఛామి’
(సంఘం అంటే మనతోపాటు జీవించే తోటి మానవులతో కూడిన సమూహం)
ప్రతి ఒక్కరూ ఈ మూడింటినీ తప్పక అనుసరించాలని చెప్పాడు.

సుత్త, వినయ, అభిదమ్మ అనే త్రిపిటకాలతోపాటు జీవన విధానాన్ని సూచిస్తూ, ఆచరించకూడని వాటిని కూడా స్పష్టంగా చెప్పాడు. వాటిని ఐదు అంశాలుగా విభజించి పంచసూత్రాలుగా ఉపదేశించాడు. అవి ‘ఇతరులకు ప్రాణహాని తలపెట్టడం, వస్తువులను అపహరించడం, విశృంఖల శృంగారం, అసత్యమాడడం, మత్తుపదార్థాలను సేవించడం’.

బుద్ధుని ప్రధాన జీవన మార్గం
సత్యాన్ని పాటిస్తూ ధర్మమార్గంలో జీవిస్తూ మరణం కోసం వేచి చూడడం. అలాగని మరణంతో జీవితం ముగుస్తుందన్న వాదాన్ని అంగీకరించదు బౌద్ధం. జీవితం ఆరుదశలుగా ఉంటుందని చెబుతుంది. వీటన్నింటినీ దాటుకుని ఉత్తమదశకు చేరడం అంటే స్వర్గాన్ని చేరడమే. అక్కడ అంతా సంతోషమే ఉంటుంది. స్వర్గాన్ని చేరాలంటే ముందుగా జీవించాల్సిన ఆరు జన్మలలో తగిన అర్హతను సాధించాల్సి ఉంటుంది. ఆరు జన్మలంటే దైవత్వం, దానవత్వం, మానవత్వంతో పాటు జంతువులుగా కూడా జన్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ కర్మానుసారం సంభవిస్తాయి. ఈ దశలన్నీ జీవికి దుర్భరమైన వేదనలను కలిగిస్తాయి. ఈ వేదనలకు తలవంచి మోహానికి లోబడి సత్యాసత్య, ధర్మాధర్మాలను విస్మరించకుండా జీవించడమే బౌద్ధం సూచించే జీవనశైలి.

తోటి మానవులను ప్రేమించటం, దుఃఖాలకు మూలమైన కోరికలను విడనాడటం, జీవహింస, అబద్ధాలు, దొంగతనాలు, మత్తుపదార్థాల జోలికి వెళ్లనని ప్రతిజ్ఞ చేయడం వల్ల మానవాళి వెలుగుబాటలోకి పయనించగలదని, ఆయన నమ్మాడు, ఆచరించాడు, బోధించాడు. విశ్వమానవ శ్రేయస్సు కోసం ఆయన రూపొందించిన పంచశీలాలు మానవాళికంతటికీ ఆదర్శప్రాయమైనాయి. బౌద్ధగ్రంథాలను త్రిపిటకాలు అంటారు. పిటకం అంటే గంప అని అర్థం. శ్రామికులు గంపలో మట్టిని నింపి ఒకరి చేతుల మీదుగా మరొకరు ఎలా అందుకొంటారో, అదేవిధంగా జ్ఞానజ్యోతిని భావితరాలకు వినయపిటకం, సుత్త పిటకం, అభిదమ్మ పిటకం అనే గ్రంథాల ద్వారా మానవాళికి అందించాడు.

శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని సత్యంతో అసత్యాన్ని జయించండి, సర్వప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండటటమే నిజమైన ధర్మము లేక మతము అని ఆయన బోధించాడు. కేవలం బోధించటమే కాదు, తన బోధనలను తానే జీర్ణం చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. బుద్ధుని బోధనలు మానవుని పవిత్రమైన, ధర్మబద్ధమైన జీవనానికి దారి చూపాయి. అందుకే ఈ ప్రపంచమంతా ఆయనను అవతార పురుషునిగా భావించింది. ఆయన జన్మించి ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన చూపిన మార్గం ఇంకా అనుల్లంఘనీయంగా భాసిల్లుతోంది. ఆ మార్గాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరూ బౌద్ధులే. ప్రతి ఒక్కరూ బోధిసత్త్వులే.

అసలు నిజం ఇది
గౌతమ బుద్ధునిపై ఒక నింద ప్రచారంలో ఉంది. అదేమంటే అర్ధరాత్రి సమయంలో భార్య యశోధర ను, కుమారుడు రాహులుడిని వదిలి వెళ్లిపోయాడని. అది నిజం కాదు. అది కేవలం అపనింద మాత్రమే. వాస్తవానికి ఆయన తనలో సమాజ సంక్షేమం పట్ల ఎంతోకాలం నుంచి ఆలోచనలు రగులుతుండగానే తండ్రికి, భార్యకు, కుమారునికి, తాను ఇక కుటుంబ జీవనం సాగించదలచుకోలేదని, ప్రపంచ ంలోని దుఃఖాన్ని తొలగించగలిగే మార్గాలను కనుగొనేందుకు అన్వేషణ సాగించదలచానని, ఏ క్షణంలోనైనా ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతానని, కాబట్టి అనుమతి ఇవ్వవలసిందని చెప్పాడు. మొదటగా వారు అంగీకరించకపోయినప్పటికీ గౌతముని పట్టుదల, దృఢసంకల్పానికి ముగ్ధులై అందుకు సమ్మతించారు. ఆ తర్వాతనే గౌతముడు అంతఃపురాన్ని వదిలి వెళ్లిపోయాడు. 
--------------------------------------------------------------

ఎప్పుడో 2555 ఏళ్ళ క్రితం చెప్పిన బుద్ధుని సిద్ధాంతాలు ఈ ఆధునిక ప్రపంచానికి చెల్లుబాటు అవుతాయా అని చాలామంది సందేహం. నాటి జీవన విధానానికి, నేటి జీవన విధానానికి అసలు పొంతన లేదు. నాడు రాచరికం ఉంటే నేడు ప్రజాస్వామ్యం ఉంది. అటు జనరిక పాలన అవినీతి, ఇటు భౌతిక సుఖలాలస జనాన్ని ఓల లాడిస్తుంటే నేటి ఈ సమాజానికి మోక్షం ఎక్కడ? అనేదానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక పరిష్కార మార్గమే ధమ్మపదం. అంటే మనసే అన్నింటికి మూలం. అంటే అన్ని శక్తులలోకి మనోశక్తి బలమైంది. దీనిని సాధించాలంటే మనసు పని చేసే తీరుతెన్నులను పరిశీలించాలి. ఇది మంచి శీలం (నడత), ధ్యానం మీద ఆధారపడిన అంతరంగ పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
- బుద్ధఘోషుడు (అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి),
బౌద్ధధర్మ పరిశోధకులు

దమ్మం శరణం


దమ్మం శరణం గచ్ఛామి...
బౌద్ధం ప్రపంచలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధధర్మాన్ని ఆచరించే వారు 23 కోట్ల నుండి 45 కోట్ల వరకు వుండవచ్చని అంచనా! ఈ బౌద్ధధర్మానికి మూల కారకులు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు... బౌద్ధులందరిచే మహాబుద్ధునిగా కీర్తింపబడినవాడు సిద్దార్థుడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఆయన బోధనలు త్రిపిటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజించి భద్రపరిచారు.

buddhaబౌద్ధధర్మాన్ని మొదటిగా బోధించిన గౌతమబుద్ధుని అసలు పేరు సిద్దార్థుడు. లుంబినిలో జన్మించి కపిలవస్తులో పెరిగాడు. తండ్రి శుద్ధోధనుడు. తల్లి మా యాదేవి.సిద్దార్థుని తాత్విక అన్వేషణ గురించి ప్రచారంలో ఉన్న కథ చూస్తే అతను పుట్టిన వెంటనే తండ్రి జ్యోతిష్కులని పిలిచి జోస్యం చెప్పమన్నారు. ఈ బాలుడు ము నుముందు గొప్ప చక్రవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడని పండితులు చెప్ప టంతో తన కుమారునికి ఎటువంటి వైరాగ్యం కలుగరాదని కోరికతో తండ్రి అతడిని సకల భోగాలతో పెంచాడు. చిన్న వయస్సులోనే యశోధరతో వివాహం చేసాడు. తన 29వ ఏట సిద్దార్థుడు నగరంలో ప్రయాణిస్తుండగా జనులు పడుతున్న కష్టా లను..చూసాడు. అతని మనసు చలించిపోయింది. తాత్విక చింతన వైపు మరలిం ది. ఒక రాత్రివేళ కుటుంబాన్ని, రాజభోగాలను వదిలి రాజప్రసాదం నుంచి నిష్ర్క మించాడు.

సత్యాన్ని అన్వేషించటానికి కఠోరమైన దీక్షబూనాడు. బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి.మహాయానం; ధేరవాదం, తూర్పు ఆసి యా, టిబెటి ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిసి) ప్రాచుర్యంలో వుం ది. బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం.త్రిపిటకములు* అనే శాస్త్ర గ్రంధం బౌద్ధానికి ప్రధాన ఆధారం అని విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బుద్ధులు మహాయాన సూత్రాలు* అనే రచనను విశ్వసి స్తారు.

ధేరవాద బౌద్ధంలో- జన్మజన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారం నుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించిన వారు బుద్ధులు అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నగాని ఇతరులకు ఉపదేశం చే యనివారు ప్రత్యేక బుద్ధులవుతారు*. శాక్యముని గౌతమబుద్ధుడు ఒక్కడు ఒక్క డే బుద్ధుడు కాదు. అంతకు పూర్వం ఇంకా ముందు కాలంలో ఎందరో బుద్ధు లుంటారు. సత్యా న్ని తెలుసుకున్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలో నాలుగు ఆర్య సత్యాలు ప్రముఖపాత్ర కలిగివున్నాయి. వాటితో పాటు అష్టాంగ మా ర్గం* కూడా!! బుద్ధుని అనంతరం బౌద్ధాన్ని ఆచరించే వారిలో అనేక విభాగాలు ఏర్ప డినాయి. వాటి ఆచరణ, సిద్ధాంతాలలో, సంస్కృతిలోనూ నెలకొన్న వైవిధ్యం కార ణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీ రించడం కష్టమవుతున్నది.

బోధి... :
బోధి అనగా నిద్రలేచుట*. థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను బోధి అంటారు. బౌద్ధం ఆరంభంలో బోధి; నిర్వాణం* అనే పదాలు ఒకే అర్థంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరిం చటం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం. తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతా లలో నిర్వాణం* అనే స్థితి బుద్ధత్వం కన్న కొంత తగ్గింది. రాగ, ద్వేషాల నుండి వి ముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది. అనగా ఇంకా మోహం వుంటుంది. ఈ మోహం కూడా తొలిగితే బోధి* స్థితి వస్తుంది.

మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని ఇంకా మోహం నుండి విము క్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని ధేరవాదంలో నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాల నుండి విముక్తి పొందిన బోధులు. బోధిత్వం పొందటానికి నాలుగు ఆర్యసత్యాలను తెలుసుకోవాలి; బోధిత్వం పొందినవారు జనన, మరణ, పునర్జన్మ, సంసారచక్రం నుండి విముక్తి పొందుతారు. మాయ తొలగి అనాత్మత* అనే సత్యం తెలుసుకుంటారు.

మధ్యే మార్గం... :
బౌద్ధ మతం సాంప్రదాయాలలో, విశ్వాసలలోనూ మధ్యే మా ర్గం ముఖ్యమైన స్థానంగలది. గౌతముడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకున్నాడు అని ప్రతీతి. వివరణలు చూస్తే...
  • కఠోరమైన దీక్షతో మన శరీరాన్ని, మనసుని కష్టపెట్టకుండా, భోగలాల సత్వంలో మునిగిపోకుండా మధ్య విధంగా సాధన, జీవితం కొనసాగించటం.
  • తత్వచింతనలో పిడివాదనలు లేకుండా మధ్యస్థంగా ఆలోచించటం.
  • నిర్వాణంలో విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలగడం.


  • త్రిరత్నాలు...:
    త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. అసలు త్రిరత్నాలు అంటే
    బుద్ధుడు: జ్ఞానోదయమైన, ధర్మమార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచ రించడం. ధర్మం: బుద్ధుడు తెలిపిన మార్గం. సత్యం, అసత్యానికి ఉన్న బేధము పర మ సత్యం. సంఘం: బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణలో పురోగమి స్తున్న వారి సహవాసం. బిక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘం లోని వారే!
    బుద్ధుడు తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని యుక్తా యుక్తం విచారించి సంఘం సహకారంతో సత్యం తెలుసుకోవాలి అని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ అందుబాటులో వుంచేది సంఘం!!!

    నాలుగు మహోన్నత సత్యాలు:
    1. దుఃఖం 2. దుఃఖానికి కారణం 3. దుః ఖం నుంచి విముక్తి 4. దుఃఖం నుంచి ముక్తిని పొందే మార్గం! బౌద్ధమతం లో పై నాలు గు పరమసత్యాలు ప్రవచింపబడ్డాయి. ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తర్వాత తన సహసాధకులకి చెప్పిన విషయాలు కనుక బుద్ధుని మొదటి బోధనలు.ధర్మచక్ర పరివర్తన సూత్రం అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి; అష్టాంగ సాధన మార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పా డు. అయితే వీటిని అప్పటి కాలంలో కష్టాలు తీర్చే మార్గంగా చెప్పాడు.

    అష్టాంగ మార్గం...
    నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచన మార్గం అష్టాంగమార్గం. ఆరంభ దశలో ఇది సామాన్యులకు బోధించే వారుకాదు.
    శీలము: శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండుట.
    సమాధి: మనసుని అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు.
    ప్రజ్ఞ: మనసుని శుద్ధపరిచే జ్ఞానం. ఇందులో రెండు అంగాలున్నాయి.సమ్యక్‌ దృష్టి - భ్రమపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం.
    సమ్యక్‌ సంకల్పం - ఆలోచించే విధానంలో మార్పు.

    మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు ధర్మము, సంఘం అనే మూడు భావాలు అవినా భావమైన శాశ్వతత్వానికి ప్రతీకలు.మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవ ణం, మననం వంటి సాధనల ద్వారా కర్మబంధాల నుంచి విముక్తి కలుగవచ్చు. అ ష్టాంగమార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మల నుంచి విమోచన కలుగుతుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధం...
    బౌద్ధమతం ప్రారంభ దశ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విశేషంగా ఆదరించబడింది. అశోకుని శిలా శాసనం బట్టి ఆంధ్రప్రవేశ్‌ అప్పటికే ధర్మ విషయంలో వుంది. గుంటుపల్లి, భట్టిప్రాలు, వంటి బౌద్ధక్షేత్రాలు హీనయాన బౌద్ధకాలంనాటివి. అసలు బుద్ధుడే భట్టిప్రోలు సందర్శించాడని ఒక అభిప్రాయం. అశోకుని, శాతవాహనుల కాలంలో రాజ కుటుంబాలు విశేషంగా ఆదరించాయి బౌ ద్ధాన్ని! ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యు న్నత స్థాయికి ఉన్న నాటి చిహ్నాలు! మహాయానం ఆంధ్రప్రదేశంలోని నాగార్జునుని తత్వంతో ప్రావర్భవించింది.

    గౌతమబుద్ధుని జాతక విశ్లేషణ...
    కర్కాటక లగ్నం, తులా రాశిలో జన్మించాడు గౌతమ బుద్ధుడు. గురు దశాశేషం దాదాపు 15 సం వుంది.కర్కాటక లగ్నం సహజంగానే ఆధ్యాత్మిక లగ్నంగా చెప్తాం. లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు. కుజుడు రాజయోగం. భాగ్యరాజ్యాధిపతుల కలయిక వలన ధర్మకర్మధిపయోగం. పంచమ, షష్టాధిపతులైన కుజ, గురుల కలయిక వలన అలౌకిక శక్తుల వృద్ధి. పంచమ, నవ మాధిపతుల సంబంధం ఆధ్యాత్మిక స్ఫూర్తి.

    లగ్నధిపతిని రాజ్యస్థానం నుంచి గురు, రవి, కుజ, శని, శుక్ర వీక్షణ. అందులోను చంద్రుడు గురునిన త్రంలో శుక్రుని ఇంట (పౌర్ణమి) వుండి చతుర్థ, లాభాధిపతియైన శుక్రుని వీక్షణ, సప్తమాధిపతి అష్ట మాధిపతి శని; షష్ట భాగ్యాధిపతి గురువు; రవి, కుజ దృష్టుల వలన రాజయో గం,ఎవరి జాతకంలోనైనా నాలుగు గ్రహాలకి మించి కలిసుంటే వారు పరివ్రాజక యోగం కలవారని తెలుస్తుంది.బుద్ధుడు పుట్టిన తర్వాత కష్టం తెలియకుండా పెరగటం, మనసు కష్టం కలిగిన దృ శ్యాలు చూసి చలించిపోయి ఇంటి నుండి వెళ్ళటం మొ అంశాలు పరిశీలిస్తే భాగ్య స్థానాధిపతి అయిన గురుని దశ అతని చిన్నతనంలో నడిచింది. (లగ్నధిపతి చంద్రు ని, గురుడు చూడటం). అలాగే అతనికి శని దశ శని అంత ర్దశలో యశోధరతో వి వాహం; (శని సప్తమాధిపతి); కుజుని అంతర్దశలో (కుజుడు పంచమాధిపతి) రా హుల్‌ జన్మించటం; శని/రాహు దశలో ఇంటి నుంచి వెళ్లపోవటం (శని వైరాగ్యకార కుడు). అలాగే గురు అంతర్దశలో, బుధుని అంతర్దశలలో తపస్సులు, హఠయో గాలు, ఆసనాలు, ప్రాణాయామాలు చేసి ధ్యానం సమాధి స్థితి పొందటం జరిగింది.

    బుధుని దశలో (బుధుడు వ్యయాధిపతి, లాభంలో ఉన్న బాధకుడు కనుక) మధ్యే మార్గంగా, అష్టాంగ మార్గాలు, శారీరకంగా అలసటని పొందటం మొ జరిగాయి. ఆ తర్వాత కేతు దశలో కూడా ప్రచారాలు, బౌద్ధకులం సంబంధించిన అంశాలు, శుక్రదశ 20 సంలు (శుక్ర, శని, కుజ, రవి, గురు కలయికచే) ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, సంఘములు స్థాపన, బౌద్ధభిక్షువులను తన శిష్యులుగా స్వీకరిం చి భారతదేశం అంతా విస్తరింప చేశారు. సంక్షిప్తంగా చూస్తే గౌతమబుద్ధుని జాతకం లో రాజయోగాలు, సన్యాసయోగాలు వున్నాయి. గజకేసరి యోగం; హఠయోగం; చంద్రమంగళ యోగం; ధర్మకర్మాదిప యోగం;... ఇలా ఎన్నో వున్నాయి. అన్నీటికీ మించి పరివ్రాజక యోగం వున్నది. దాని వలన ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని భోగాలు అనుభవించటానికి అవకాశం వున్నా అన్నీ త్యజించి సన్యాసం స్వీకరించి భవబంధా లకి దూరంగా వుండిపోతారు. మహారాజ బిడ్డగా మహా యోగాలతో పుట్టుకతోనే మహారాజుగా పుట్టినా బుద్ధుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారటం... పరివ్రాజకయోగమే!!

23, జనవరి 2013, బుధవారం

బౌద్ధ మతం కొన్ని ముఖ్య సిద్ధాంతాలు


బౌద్ధ మతం - ముఖ్య సిద్ధాంతాలు:


థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం".


బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.


బోధి:--

బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.


తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది. మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.




బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు.


మధ్యేమార్గం:---

బౌద్ధ మతం సాంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి

1.కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
2.తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం
3.నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.


త్రిరత్నాల శరణు:---

సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు. దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.




బుద్ధుడు

జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.

ధర్మము

బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము

సంఘము

బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.


"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.


మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.


నాలుగు మహోన్నత సత్యాలు:---


బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి

1.దుఃఖము
2.దుఃఖానికి కారణము
3.దుఃఖంనుండి విముక్తి
4.దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.


అష్టాంగ మార్గం:--

నాలుగు పరమ సత్యాలలో నాలగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.ఆరంభ కాలం బౌద్ధ గ్రంధాలలో (నాలుగు నికాయాలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు.అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)




శీలము - శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:

1."సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
2."సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
3."సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు సంగాలు ఉన్నాయి.

4."సమ్యక్ వ్యాయామము" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
5."సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
6."సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలుకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

7."సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
8."సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన.

జీవితాదర్శం

బుద్ధుని జీవితాదర్శం


గౌతమ బుద్ధుని దర్శించి తరించిన వనితా రత్నాల్లో శ్యామావతి ఒకరు. ఆమె గొప్ప సుగుణాల రాశి. ఆక సద్గుణ సంపదే ఆమె మహారాణి అయ్యేందుకు కారణమయ్యింది. ఆమెను బుద్ధుని వైపు నడి పించింది.
ఆ ప్రాంతం పేరు వత్సదేశం. ఆ దేశ ప్రజలను  పాలిస్తున్న రాజు శంఖముఖుడు. ఆయన ముఖస్తుతి ఏ పాటి సత్యం ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తి అందుకే ఒక పక్క తన పరిపాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుంటూనే, మరో పక్క తానే స్వయంగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ, అందుకు అనుగుణంగా పాలించేవాడు. శంఖ ముఖుడు ఒకసారి రౌరక గ్రామం పక్కనున్న వల్గుమతి అనే చిన్న నది ఒడ్డుకు వచ్చాడు.
ఆ నదీ తీరంలో తడి ఇసుకతో గూళ్లు కట్టుకుంటున్న ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. వారికేసి అలా చూస్తూ ఉండగానే, ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఆ ఇసుక గూళ్లను తొక్కేశాడు. కూలిపోయిన ఇసుక గూళ్లను చూసి ఒక అమ్మాయి గట్టిగా ఏడ్చింది. ఇంకో అమ్మాయి మాత్రం ఏడ్వకుండా వాటికేసి అలా చూస్తూ ఉండిపోయింది. శంఖముఖుడు మాత్రం ఇసుక గూళ్లను కూల్చేసిన పిల్లవాడి చెవులు పిండుతూ ” ఎందుకు ఆ గూళ్లను తొక్కేశావు? వాటిని నువ్వే మళ్లీ కట్టివ్వు” అన్నాడు చాలా కోపంగా.
వెంటనే ఆ కుర్రాడు తిరిగి ఇసుక గూటిలో నిర్మించే పనిలో పడ్డాడు. అది చూసిన అమ్మాయి తన ఏడుపు ఆపేసింది. శంఖముఖుడు శాంతంగా ఉన్న పాపను దగ్గరగా తీసుకుని, “పాపా! నీ పేరేంటమ్మా” అంటూ ప్రశ్నించాడు ఎంతో ఆప్యాయంగా. వెంటనే ఆ పాప తన పేరు ” శ్యామ అని చెప్పడంతో పాటు, తన తల్లిదండ్రుల గురించి, వారున్న నివాస స్థలం గురించి చెప్పింది.
ఆ పాప ముద్దు ముద్దు మాటలు శంఖముఖునిపై చెరగని ముద్ర వేశాయి. శంఖముఖుడు తన రాజధానికి వెళ్లినా ఆ పాపే పదే పదే గుర్తుకు వస్తూ ఉండేది.
బుద్ధుని దర్శనం
ఏళ్లు గడిచాయి. రాజా శంఖముఖుని కుమారుడు ఉదయనుడు పెళ్లీడుకొచ్చాడు. వధువు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సమయంలో శంఖముఖునికి శ్యామ గుర్తుకొచ్చింది. శ్యామనే తన కోడలుగా ఎందుకు తీసుకురాకూడదు? అనుకున్నాడు. వెంటనే రౌరక గ్రామానికి తన మనుషులను పంపాడు.అయితే ఆ పదేళ్లలో శ్యామ కుటుంబం ఓ ఐదు గ్రామాలను మార్చింది.

ఎంతో కష్టపడి చివరికి రాజసేవకులు వారున్న ఊరును కనుక్కోగలిగారు. వారున్న ఊరి పేరు ‘తిమింగల’. వారు శ్యామ తండ్రిని కలిసి రాజుగారి ఉద్దేశాన్ని తెలియబరిచారు. ఆయన అదో గొప్ప అదృష్టంగా భావించిక శ్యామను ఉదయునికి ఇచ్చి వివాహం జరిపించారు. ‘ శ్యామ’ ఆ దేశ ప్రజల చేత “మహారాణి శ్యామావతి” గా గౌరవించబడింది.
శ్యామావతి ఆధ్యాత్మిక చింతనగలది. బుద్ధ భగవానుడు కౌశాంబిలోని ఘేషితారామంలో ఉన్న విషయాన్ని తెలుసుకుని, వీలైనప్పుడల్లా ఆయనను దర్శించి ఆయన భోధామృతాన్ని గ్రోలేది. తన భర్త ఉదయనుడు కూడా బుద్ధ భగవానుని దర్శించాలని ఎంతగానో అభిలాషపడేది. కానీ, ఆయనేమో పెద్ద భోగలాలసుడు. నిరంతరం తినడం, తాగడం నాట్యకత్తెలతో గడపడమే ఆయనకు తెలిసిన ఆనందం. ఆ ఆనందం క్షణికమని, దాన్ని మించిన శాశ్వతానంద పథం ఒకటుందని ఊహించే స్థితిలోనే లేడాయన.
బుద్ధుని దర్శనానికి తాను వెళుతున్న ప్రతిసారీ, అతన్ని కూడా తనతో పాటే రమ్మని శ్యామావతి చాలా సార్లు కోరింది. కానీ, ఆ మాటలు అతనికి ఏ మాత్రం చెవికెక్కలేదు. ఒక్కసారి బుద్ధ దర్శనానికి తనవెంట రమ్మని మరీ మరీ బతిమిలాడింది.
అందుకు ఆయన ‘శ్యామా! నీవు నా అర్థాంగివి. నీవు ఆయన్ను పదేపదే దర్శించి దండిగా పుణ్యం కట్టుకురా. అందులో సగభాగం నాకు ఎలాగు దక్కుతుంది’ అని చెప్పి తప్పించుకున్నాడు. శ్యామావతి గత్యంతరం లేక ఒంటరిగానే వెళ్లి బుద్ధుని బోధను తనివితీరా అనుభవించేది.
శ్యామావతి సందేహం
బుద్ధుని బోధనలు విన్న శ్యామావతికి ఒక సందేహం కలిగింది. బుద్ధునితో ఆమె “శాస్తా, మీరు అనేక ధర్మాలను బోధిస్తారు. అన్ని ధర్మాలకు ఏది ఆధారం, ఏది మనిషికి అమిత బలాన్నిచ్చేది? దయచేసి అట్టి ధర్మాన్ని వివరించండి” అని విన్నవించింది. గౌతమబుద్ధుడు ఆమె జిజ్ఞాసను ఎరిగిన వాడై “మహారాణీ! మీకు చాలా మంచి సందేహమే కలిగింది.

మీలో కలుగుతున్న అంతర్మదనానికి స్పష్టమైన సంకేతమే అది. మీరు నా మాటలను ఎంత శ్రద్ధగా వింటున్నారో సూచిస్తుంది. అన్ని ధర్మాలకు ఆధారం అప్రమాదం(అప్రమత్తత), నిరంతర జాగరూకత. అన్నిటికీ బలాన్నిచ్చేది అదే.
అన్ని ప్రమాదాల నుంచి రక్షించేది అదే. అన్ని జంతువుల పాదాల గుర్తులు ఏనుగు పాదం గుర్తులో అణగిపోయినట్లుగా అన్ని కుశలధర్మాలు ఈ అప్రమాదంలో అంతర్గతములవుతాయి” అని వివరించాడు.ప్రపంచ ప్రఖ్యాత ఆధునిక తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి “మనముందు ఒక విష సర్పం పడగవిప్పి మనలను కాటువేయడానికి బుసకొడుతుంటే మనం ఆ కాటును తప్పించుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో అంత జాగ్రత్తగా ప్రతి నిమిషం జీవించాలని బోధిస్తాడు.
నిజానికి మనల్ని కాటువేయడానికి సిద్ధంగా వున్నది ఒక విష సర్పం కాదు. కామ, క్రోధ, మద, మోహాలనే నాలుగు విషసర్పాలే కాక లోభం, మాత్సర్యం అను మరు రెండు కాల నాగులు. ఇక మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో మరి.
ధర్మసంపత్తి
గౌతమ బుద్ధుడు మహారాణి శ్యామావతికి ఒక అద్భుత ఊహాచిత్రం ద్వారా అప్రమాదం యొక్క ఆవశ్యకతను తెలిపాడు. కింద భూమి, పైన ఆకాశాన్ని తగులుతూ నాలుగు దిక్కుల నుంచి నాలుగు మహా పర్వతాలు ఒకదానికెదురుగా ఒకటి ముందుకు కదిలివస్తున్నాయి. వాటి మధ్య మనిషి ఉన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పర్వతాల మధ్య అతడు నలిగి చావవలిసిందే. గత్యంతరం లేదు. ముసలితనం, వ్యాధి, విపత్తి, మరణాలే ఆ నాలుగు పర్వతాలు.

యవ్వనాన్ని తరుముతూ ముసలితనం, ఆరోగ్యాన్ని చిదుముతూ వ్యాధి, సంపదను చంపుతూ విపత్తు, జీవితాన్ని మింగేస్తూ మరణం వస్తాయి. అప్పుడు, అటు పిమ్మటైనా తోడు వచ్చేది ఆ మనిషి కూడబెట్టిన ధర్మసంపత్తే. అప్రమాద వర్తనులే ధర్మసంపత్తిని ఆర్జింగలరు.
మహారాణి శ్యామావతి సమక్షంలోనే అక్కడున్న భిక్షువులనుద్దేశించి “అప్రమాదం నిర్వాణానికి దారితీస్తుంది. ప్రమాదం మృత్యువుకు దారి తీస్తుంది” అని బుద్ధభగవానుడు హిత బోధ చేశాడు. సందేహం తీరిన శ్యామావతి బుద్ధ భగవానుని పాదపద్మాలకు నమస్కరించి తేలికబడ్డ హృదయంతో రాజమందిరానికి చేరింది. భగవానుని బోధనునిత్యం స్మరిస్తూ, ఆచరిస్తూ తరించింది.

బుద్ధుని బోధనలు

బుద్ధుని బోధనలు

గౌతమ బుద్దుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందిన రోజు వైశాఖ పూర్ణిమ. రోజు బౌద్ధులకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకనగా రోజున బుద్ధుని జననము, జ్ఞానోదయము, పరినిర్వాణము జరిగాయి. పున్నమి చంద్రుడు ఎలాగైతే తన చల్లని వెలుగును లోకానికి వేదజల్లాడో బుద్ధుడు తానూ కనుగొన్న దుఃఖ నాశన మార్గాన్ని లోకానికి దాదాపు 40 ఏళ్ళు బోధించి పరినిర్వాణం చెందాడు.
భగవాన్
బుద్ధుడు కనుగొని లోకానికి బోధించిన జ్ఞానం ఏమిటి? దీనిని క్లుప్తంగా రెండు మాటలలో చెప్ప వచ్చు.
1.
నాలుగు ఆర్య సత్యములు
2.
ఆర్య అష్టాంగ మార్గము
భగవాన్ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని గురించి చాలా చోట్ల వివరించే టపుడు అది రెండు విధాలుగా ఉన్నదని చెప్పాడు.ఒకటి- నాలుగు ఆర్య సత్యములను దర్శించుట.రెండవది- ప్రతీత్య సముత్పాద నియమమును దర్శించుట.
నాలుగు
ఆర్య సత్యములు.
1.
దుఃఖము సత్యము
2.
దుఃఖ కారణము సత్యము
3.
దుఃఖ నాశనము సత్యము
4.
దుఃఖ నాశన మార్గము సత్యము.
ఆర్య అష్టాంగ మార్గము.
1.
సమ్యక్ దృష్టి
2.
సమ్యక్ సంకల్పం
3.
సమ్యక్ వాక్
4.
సమ్యక్ కర్మ
5.
సమ్యక్ ఆజీవం
6.
సమ్యక్ వ్యాయామం
7.
సమ్యక్ స్మృతి
8.
సమ్యక్ సమాధి
ఇవి తిరిగి శీల, సమాధి, ప్రజ్ఞలుగా విభజింప బడినవి. వీటిలో ఒక్కొక్కటి వివరంగా చూద్దాము. అపుడు బుద్ధుని దర్శనము, చింతన, బోధనలు స్పష్టంగా అర్థం చేసుకొనడానికి వీలవుతుంది
 అస్సజి బుద్దుని మొదటి అయిదుగురు శిష్యులలో ఒకడు. మిగిలిన నలుగురు భద్దియ, కొండన్న, మహానామ,వప్ప. వీరు బుద్ధుడు నిరాహారిగా ఉంటూ తీవ్ర సాధనాలు చేస్తున్న సమయంలో ఆయనను అనుసరించి ఉండేవారు. ఆహారంమానేసి శరీరాన్ని కృశింప చేసి ఇంద్రియ దాస్యం నుంచి ముక్తి పొందటమే మోక్షం అని ఒక భావన కాలంలో ఉండేది. కాని బుద్దుడు ఇది తప్పు అని స్వానుభవం ద్వారా తెలిసుకొని ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభం చేస్తాడు. ఇది చూచి అయిదుగురు భిక్షువులూ ఆయన సాధనా మార్గంలో భ్రష్టుడై నాడని తలచి, విడచి తమ మార్గాన పోతారు.

తరువాత కొంత కాలానికి బుద్దుడు జ్ఞానోదయాన్ని పొంది, తానూ కనుగొన్న మార్గాన్ని లోకులలో ఎవరికీ బోధించాలిఅని దివ్య దృష్టి తో చూస్తాడు. తాను ఒకప్పుడు శిష్యరికం చేసిన గురువులైన అలార కలాముడు, ఉద్డక రామ పుత్రుడుఅనేవారు గతించారన్న విషయాన్ని దివ్య చక్షువుతో చూచి, తన అనుచరులైన అయిదుగురు భిక్షువులు కాశీసమీపంలోని సారనాథ్ వద్ద ఉన్నారని గ్రహిస్తాడు.

తరువాత వారికి చేసిన బోధనే ధర్మ చక్ర ప్రవర్తనం అంటారు. విధం గా బుద్ధ ధర్మం ప్రచారంలోకి వచ్చింది. అయిదుగురు శిష్యులలోని వాడే అస్సజి లేక అశ్వజిత్ అనే భిక్షువు. తరువాత వీరందరూ బుద్ధుడు చెప్పిన మార్గాన్నిసాధన చేసి బుద్ధత్వాన్ని పొందారు.

అస్సజి వద్దకు సారిపుత్రుడు వచ్చి బుద్ధుని బోధనలు ఏవి? ఆయన కనుగొన్న మార్గం యొక్క వివరాలు ఏమిటి ? అని ప్రశ్నిస్తాడు. దానికి అస్సజి " అయ్యా, నేను జ్ఞానములో అంత పండితుడను కాను. బుద్ధుడు కనుగొన్న మార్గంయొక్క వివరాలు నాకు పూర్తిగా తెలియవు. కాని స్థూలంగా చెప్పగలను. జీవులకు కలిగే దుఖం యొక్క కారణాలు, కారణాలను నిర్మూలించే మార్గం ఆయన కనుగొన్నాడు". అని చెబుతాడు. దానికి సారిపుత్రుడు ఆనంద భరితుడైమౌద్గాల్యాయనుని తో కలసి బుద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు.

అస్సజి బుద్ధుని మార్గాన్ని చక్కగా నిర్వచించాడు. ఎవరైనా బుద్ధ ధర్మమును గురించి చెప్పవలెనంటే ఇంతకంటేక్లుప్తముగా చక్కగా చెప్పటం కష్టం. బుద్ధుని సమస్త బోధల సారాంశం ఇందులో ఇమిడి ఉన్నది.
 

18, జనవరి 2013, శుక్రవారం

మహితాత్ముడు


                    బుద్ధుడు మహితాత్ముడు 

 

ఈ విశాల విశ్వంలో  మానవ మనుగడకు మార్గదర్శకుడైన మహానుభావుడు బుద్ధుడు. కాల్పనిక, పౌరాణిక, వ్యక్తిగా కాకుండా వివక్తమైన మనుష మూర్తిగానే తత్వాన్ని ప్రబోధించి మనలో చైతన్యాన్ని పెంచేందుకు పాటుపడ్డ మహితాత్ముడు బుద్ధుడు.
భూమి పుట్టిన తర్వాత చరిత్రలో బుద్ధుడంతటి మహామహుడు జన్మించలేదంటే అతిశయోక్తి లేదు. అందుకు కృతజ్ఞతా పూర్వకంగానే నేమో! ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తథాగతుణ్ని స్మరిస్తూ బుద్ధపౌర్ణమి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడు తున్నాయి.
వైశాఖ పౌర్ణమి విశిష్టత
ఇప్పటికి 2574 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం 563వ సంవత్స రంలో వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధునిగా ప్రసిద్ధుడైన గౌతముని జననం జరిగింది. అలాగే, గౌతమునికి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే గయలోని బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమైనట్లు, పంచవర్గ భిక్షకులకు బుద్ధుడు ప్రథమ సందేశమిచ్చినట్లు చరిత్ర. చాలా చిత్రంగా ఆయన తన 80వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే నిర్యాణం చెందారు.
ఈ విధంగా వైశాఖ పౌర్ణమి బుద్ధుని జీవితంలో అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. కాబట్టే ఇది అందరికీ అతి పవిత్రమైన దినంగా మారిపోయింది.
గౌతముని బాల్యం
బుద్ధునిగా వినతికెక్కిన తథాగతుని అసలు పేరు సిద్దార్థుడు. కపిల వస్తు పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న శాక్యవంశపు రాజైన శుద్దోధనుడు, రాణి మాయాదేవిల పుత్రుడే సిద్దార్థుడు. చిన్నతనం లోనే తన తల్లి రాణి మహామాయదేవి మరణించడంతో సిద్ధార్ధుడు తన పిన తల్లి ప్రజాపతి గౌతమి వద్ద పెరిగాడు. సిద్ధార్థుణ్ని అందరూ ఆ నాటి నుండే గౌతముడిగా పిలవడం ప్రారంభించారు. చిన
చిన్నతనంలోనే అతను సమస్త విద్యలను అభ్యసించాడు. 19వ ఏట యువరాణి యశోధరతో గౌతమునికి వివాహం జరిగింది. యశోధరతో దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ రాహుల్‌కి జన్మనిచ్చిన అనంతరం ప్రాపంచిక సౌఖ్యాలపై విరక్తి చెందిన గౌతముడు భార్యబిడ్డలను, రాజ్యాన్ని వదిలి అడవీ భూములకు వెళ్లాడు.
బుద్ధుడుగా మారిన వైనం
ప్రపంచమంతా దుఖమయమని, దీని నుండి విముక్తి పొందడానికి మార్గాన్ని అన్వేషించాలని నిశ్చయించుకున్న గౌతముడు రాజ్యాన్ని, భోగ భాగ్యాలను త్యజించాడు. భార్యబిడ్డలను సైతం వదిలి సత్యాన్వేషణకై వివిధ ప్రాంతాలను సందర్శించాడు. ఇందుకోసం అడవులలో తపస్సు చేసినప్పటికీ గౌతముడికి ఆశించిన ఫలితం కనిపించలేదు.
తాను అనుకున్న లక్ష్యం నెరవేరక పోవడంతో దానికోసం తిరుగుతూ తిరుగుతూ చివరకు గయవద్ద ఒక రావిచెట్టు కింద ధ్యానముద్రలో కూర్చున్నాడు. అప్పుడే ఆ మహానుభావునికి జ్ఞానోదయం కలిగింది. నాటి నుండి సిద్దార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు. కమలం, కలువ పువ్వులు నీటిలో జన్మించినప్పటికి ఆ నీటిని తాకకుండా, అందులోని బురద అంటకుండా ఉన్నట్లే మనుష్యు నిగానే జన్మించిన గౌతముడు సహజమైన మానుష్య లక్షణాలను అలవర్చుకోకుండా, మానవ జీవితంలోని మాయ తొలగించే మార్గాన్ని శోధించేందుకు యత్నిస్తుండే వాడు. ప్రపం చానికి అంటిపెట్టు కోకుండా జీవించాడు. కాబట్టే మనిషిలో వుండే బలహీనతలను జయించి, ఆది మహాను భావునిగా ప్రసిద్ధు డయ్యాడు. రాగ ద్వేష, లోభాది ఆనవాళ్ల ను జయించి గౌతముడు బుద్ధుడయ్యాడు.
మానవులలో ఉత్తముడిగా...
బుద్ధున్ని హిందువులు విష్ణు అవతారాలలో ఒకటిగా భావించినా, బుద్ధుడు మాత్రం తాను దేవుణ్ని కాదని, మానవుడినేనని చెబుతుండే వాడు.
దైవాన్నంగీకరించక, వేదాలను ధిక్కరిస్తూ ఆత్మలేదని బుద్ధుడు ప్రకటిస్తుండేవాడు. అహింస, మైత్రి, కరుణలను ప్రోత్సహిస్తూ కర్మకాండలు, జంతుబ లులను నిరసించాడు.
విశ్వంలోని ఏ ఇతర మత ప్రవక్తలకైనా తమ ఉన్నత స్థితికి బాహ్య ప్రపంచం నుండి, గురువుల నుండి ప్రేరణ లభించింది. కానీ బుద్ధునికి మాత్రం బాహ్యాధారం లేకుండానే తనలోనుండే ప్రేరణలభించింది. కాబట్టే ఆయన్ను స్వయం భూ అనేవారు. అందుకనే బుద్ధుడు దేవుడిగా కాకుం డా మానవుల్లో ఉత్తము డిగా నిలి చాడు. సరళ తనం, నిజాయితీ, ఏకాంత జీవి లక్షణాలు బుద్ధుని జీవితంలో అగుపిస్తుంటాయి.
బుద్ధుని బోధనలు...
బుద్ధుడు ఏ విషయాన్నైనా మాటల పరంగాకాని, బుద్ధి రూపంలోకాని చెప్పి సంతృప్తి చెందలేదు. తాను అనుభవంలోకి తెచ్చుకున్న విషయాన్ని మాత్రమే ప్రజలకు చెప్పేవాడు. అలాటి వాటితోనే ప్రజలకు మేలైన ఉపయోగ ముంటుందని అంటుండేవాడు. మనకే ఉపయుక్తం కానిది మరొ కరికెలా ఉపయోగపడు తుందనేది ఆయన వాదన. అనిత్యవస్తువులను నిత్యాలుగా చూడడం, లేని ఆత్మను ఉన్నట్లు భావించడం, సర్వస్వం దు:ఖ మయమని తెలుసుకోలేక పోవడంవల్ల జీవితంలో అసంతృప్తి, దు:ఖం మిగులుతుందని ఆయన స్పష్టం చేస్తుండేవారు.
ధ్యాన మార్గాన్ని అనుసరిస్తే సరైన దృష్టి ఏర్పడి ప్రపంచాన్ని అనిత్యంగా, చూస్తూ జ్ఞానోదయం కలుగుతుందని బుద్ధుడు వివరించాడు. కార్యకారణ సిద్ధాంతాన్ని శాస్త్రీయ ప్రాతిపదికపై విశ్లేషించాడు. మానవుల్లో తృష్ణ వల్లే దు:ఖం పుడుతుందని దాన్ని నిరోధించాలని ప్రబోధించాడు.
బుద్ధుడు ప్రతిపాదించిన ప్రాతిత్య సమూత్పాద సిద్ధాంతంనుండే ఆర్యసూత్రాలు జనించినవి. బుద్ధుడు నాలుగు ఆర్యసూత్రాలను ప్రతిపాదిం చాడు. అవే...
దు:ఖం, దు:ఖానికి కారణం కోరికలు, వాటిని జయించడంద్వారా దు:ఖాన్ని నివారించవచ్చు. దీని నివారణకు అష్టాంగ సూత్రాలు మార్గ నిర్దేశం
అష్టాంగ సూత్రలేమిటంటే.... సమ్యక్‌ దృష్టి (ఉత్తమ ఆదర్శాలు), సమ్యక్‌ సంకల్ప (ఉత్తమ సంకల్పం), సమ్యక్‌ వాక్‌ (ఉత్తమ వాక్యాలు), సమ్యక్‌ వ్యాయమ (ఉత్తమ సాధన), సమ్యక్‌ స్మృతి (ఉత్తమ స్మరణ), సమ్యక్‌ సమాధి (ఉత్తమ ధ్యానం) అనే అష్టసూత్రాలను ఆచరించడం ద్వారా మానవులు తమ కోరికలు, స్వార్థమనే పర్వతాలనుండి విముక్తి పొంది తద్వారా మోక్షం పొందుతారని బుద్ధుడు ప్రబోధించాడు.
బౌద్ధమత విస్తరణ: అప్పుడు బుద్ధుడు ప్రవచించిన మతమే బౌద్ధ మతంగా స్థిరపడింది. ఆయన శిష్యలు, అనుచరులనే బౌద్ధులని, భిక్షువులని పిలుస్తారు. వారణాసి వద్ద సారనాథ్‌లో బుద్ధుడు తొలిసారిగా పంచవర్గ బిక్షువులకు ఉపదేశమిచ్చాడు. బుద్ధుని శిష్యులలో ఉపతిప్ప, అస్సాజీలు ముఖ్యులుగా వుండేవారు. తదుపరి అనేకమంది చక్రవర్తులు బౌద్ధమతాన్ని స్వీకరించి, బౌద్ధమత ప్రచారానికి కృషి చేశారు.
మనదేశంలో పుట్టిన బౌద్ధమతం కాల క్రమేణ ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. మగధరాజు అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించి తన రాజ్యంలో మూడవ బౌద్ధమత సభను నిర్వహించాడు. అంతేకాదు! మత వ్యాప్తికై విదేశాలకు తన కుమారుడైన మతం ఇవ్వలేని స్వేచ్ఛను బౌద్ధమతం ఇచ్చింది. ఇది ఓ ధర్మంగా, ఓ జీవన విధానంగా ప్రసిద్ధికెక్కింది. బౌద్ధం తత్త్వ శాస్త్రాన్ని బోధించింది. అందుకే బౌద్ధమతం మనదేశంలోనే కాకుండా చైనా, టిబెట్‌, హాంకాంగ్‌, జపాన్‌, సుమిత్ర తదితర ఆగ్నేయ ఆసియా దేశాలలో సైతం విస్తరించింది.
మన రాష్ట్రంలో నాగార్జున కొండ, అమరావతి, పట్టణాలు ముఖ్య బౌద్ధ ఆరామాలుగా వెలుగొందాయి. దేశంలో లుంబిని, గయా, సాంచి, సారనాథ్‌, లాంటి క్షేత్రాలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు చైతన్యాలు నెలకొల్ప బడ్డాయి. భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మూడు లక్షల మంది అనుచరులతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంతే కాదు! ఆయన పంచశీల సిద్ధాంతాల్ని రూపొందిన ప్రవక్త కూడా.
ఆయన బోధనలను ఆచరిస్తేనే దేశంలో శాంతి సుభిక్షంగా ఉంటుంది.

విశ్వ ధర్మ ప్రవర్తకుడు


 

 విశ్వ ధర్మ ప్రవర్తకుడు గౌతమ బుద్ధుడు


 
                విశ్వ ధర్మప్రవర్తకుడు, సకల భారత హృదయ చక్రవర్తి బుద్ధుడు. ఆ మహనీయుని దివ్య బోధనలు ప్రజాహృదయాలపై ప్రవహించి ధార్మిక ఫలాలను పండించాయి. ఆ తపోశ్రేష్టుడి దయాదృష్టి సకల జీవకారుణ్యానికి ప్రతీకగా నిలిచింది. బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. ప్రజాపతి గౌతమి సిద్ధార్థ కుమారుని పెంచి పెద్ద చేసింది. ఆ కారణంగా ఆ మహనీయునికి గౌతమ సిద్ధార్థుడనే పేరు సార్థకమైంది. బుద్ధుడు మహాచక్రవర్తి. శుద్ధోను, మాయాదేవి కుమారుడైన సిద్ధార్థుడు యుక్తవయస్సులోనే ప్రాపంచిక విషయాలపట్ల ఆసక్తి కనబరచకుండా, భావశాంతికోసం తీవ్రమైన మేధోమధనం చేశాడు సిద్ధార్థునికి 28 సంవత్సరాల ప్రాయంలో. ఒకసారి వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, యతిని చూచి భౌతిక జీవనం పట్ల విరక్తి చెందాడు. శాశ్వతమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇల్లు విడిచి పెట్టాడు. ఆ క్రమంలో ఎన్నో క్షేత్రాలను సందర్శించాడు. సందర్శించిన ప్రతీ ప్రాంతంలోనూ ఏవో సమస్యలు, అతని అంతర్మధనంలో కొత్త పరిష్కారాలకు తావిచ్చాయి. ఈ క్రమంలోనే మానవాభ్యుదయం, శాంతి సౌఖ్యాలకోసం బుద్ధుడుమార్గాన్ని అనే్వషించాడు. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం కింద తపస్సుచేసి జ్ఞానోదయాన్ని పొందాడు. ఈ క్రమంలో అతడు గౌతమ సిద్ధార్థుడు కాస్తా గౌతమ బుద్ధుడయ్యాడు. దీనినే ‘మహాసంబోధి’అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగా ప్రస్తుతమున్న రావివృక్షం (బోధి వృక్షం) బౌద్ధులందరికీ ఆరాధ్య వృక్షరాజమైంది. సమస్త మానవాభ్యుదయ విరోధం దుఃఖమని బుద్ధుడు తన సత్యసారమున చాటాడు. బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు. దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖనిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఈ ఎనిమిది అంశాలతో బౌద్ధ ధర్మం, మతం ఏర్పడింది. బుద్ధునిచే బోధింపబడిన ధర్మం కనుక బౌద్ధ్ధర్మం అయ్యింది. ఆ క్రమంలో బుద్ధుని ఆశ్రయించిన వారు బౌద్ధులయ్యారు. బుద్భుని రాకతో ప్రజలు మేల్కొన్నారు. క్రమంగా బుద్ధుని ధర్మాచరణ - సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. ఈ నేపధ్యంలో బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు. ఆకలితో ఉన్న వాడెవడూ ధర్మాన్ని తెలుసుకోలేడు. ఈ రహస్యాన్ని చేధించిన గౌతమబుద్ధుడు సమాజంలో అందరూ ఆకలిదప్పులు లేకుండా ఉండాల్సిన ప్రాథమిక అవసర సత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. అలాగే కాషాయం కట్టినవాడు ప్రతి ఒక్కడూ గొప్పవాడు కాదని హెచ్చరించాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాషాయం కట్టకూడదని, అలా కట్టేవాడు నియమాలను, సత్యాలను వంచించకూడదని బోధించాడు. బుద్ధుని బోధనలకు అనేకమంది ఆకర్షితులయ్యారు. తమ జీవన మార్గాలను విడిచిపెట్టి బుద్ధుడు బోధించిన అహింసా, శాంతి మార్గాలలో నడిచాడు. తన ఈ ధర్మప్రబోధానికిగాను బుద్ధుడు కోరి బాటనే ఎంచుకున్నాడు. అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు. ఈ క్రమంలో అనేకమంది దుర్మార్గులు సైతం సన్మార్గులుగా మారారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే ఆయన నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. తన శిష్యుల సహకారంతో ధార్మిక చర్యలను, ప్రసంగాలను చేసేవాడు. ఎవరైతే ధ్యానానురక్తులై ధర్మానుష్టాన చిత్తులై సంఘశ్రేయస్సును కోరతారో వారే తమ ప్రియుష్యులని బుద్ధుడనేవారు. అహింసా, సత్యవ్రతాలతో దినరాత్రులు ఎవరైతే ధ్యాన నిరతులుంటారో వారే తమ శిష్యులని ప్రకటించారు. బుద్ధుడు అహింసను, శాంతిని బోధించాడు. మనల్ని పట్టిపీడిస్తున్న ద్వేషాన్ని ప్రతీ ఒక్కరూ విడిచిపెట్టాలని బుద్ధుడు బోధించాడు. ద్వేషంవల్ల ద్వేషం నశించదని, అది ప్రేమవల్లనే నశిస్తుందని ప్రబోధించాడు. ఇలా దీర్ఘకాలంపాటు అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తూ బుద్ధుడు తన బోధనలు కొనసాగించాడు. ధర్మప్రచారంలో 80 ఏళ్ళవరకూ జీవించాడు. చివరికి కుశీనగరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా మరందరూ బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి. కులవ్యవస్థ నిర్మూలనకు, శాంతి స్థాపనకు ధర్మరక్షణమొక్కటే మార్గమని భావించిన మహనీయుడు బుద్ధుడు.
మనిషిని పట్టిపీడించే దుఃఖాన్ని పరిత్యజించిననాడే ధర్మరక్షణకు ఆత్మనివేదనకు మార్గం సుగమం అవుతుందని, అందువల్ల ఎవరికివారు ఆత్మశుద్ధిని చేసుకుని మానవాభ్యుదయానికి, శాంతిస్థాపనకు కృషిచేయాలని బుద్ధుడు ప్రబోధించాడు. లుంబినీ వనంలో పుట్టి, బుద్ధగయలో జ్ఞానం పొంది, ‘సారనాథ్’లో ధర్మప్రబోధం చేసి, కుశీనగరంలో మహా పరినిర్యాణం చెందిన బుద్ధుని జీవనం సదా స్మరణీయం. ఆయన బోధనలు, ధర్మస్థాపనకు ఆయన అనుసరించిన మార్గాలు సదా ఆచరణీయం. ఆ మహనీయుని బోధనల సారాన్ని గ్రహించి విశ్వమానవ కళ్యాణానికి పాటుపడడమే మనందరి కర్తవ్యం.
                    బుద్ధం శరణం గచ్ఛామి
                        ధర్మం శరణం గచ్ఛామి
                               సంఘం శరణం గచ్ఛామి.

పరివర్తన

బందిపోటులో పరివర్తన తెచ్చిన

బుద్ధుడు

.


సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసివచ్చింది. శరీరపు అణువణువునా ఆశ్చర్యం ఉట్టిపడుతూండగా ఆయన ఘోషించాడు: "ఓహో! ఇదంతా ఎక్కడ మొదలౌతున్నదో, ఎలా పని చేస్తున్నదో, దీనికి తాళంచెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది! నేను ఇక తలుపులు తెరచి, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విహరిస్తాను" అని. ప్రేమ, కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన 50 సంవత్సరాలపాటు గ్రామగ్రామాలా కాలినడకన తిరిగి, తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటీ పంచుకున్నాడు. లక్షలాదిమంది ఆయన శిష్యులై మేలుగాంచారు.
బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలిదినాలలో, ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవిదారిన పోతున్నాడు. అంతలో తన వెనుకనుండి ఎవరో తనపై దాడిచేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి. బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు. చూస్తే, వచ్చింది ఒక బందిపోటు దొంగ! కండలు తిరిగిన ఆ దొంగ నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది. ముఖంలో క్రూరత్వం ఘనీభవించినట్లు మెలితిరిగిన మీసం ఉన్నది.
"నిన్ను చూస్తే ధైర్యసాహసాలున్న యువకుడిలాగే ఉన్నావు. కానీ ఇలా పిరికివానిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?" అని అడిగాడు బుద్ధుడు.
"నువ్వు వినలేదా నా గురించి? నేనే చంగాను! ఈ ప్రాంతంలో పసిపిల్లలుకూడా `చంగా' అన్న పేరు వినగానే నోరుమూసుకుంటారు. ఊ, నీదగ్గర ఉన్న సంపదనంతా తీసి ఇచ్చెయ్. లేదా, నీ తల నీ మెడపై ఉండదు. జాగ్రత్త! త్వరగా ఇచ్చెయ్" అన్నాడు బందిపోటు, కత్తిని తళతళలాడిస్తూ. బుద్ధుని ప్రవర్తనలో భీతి లేదు. ఆయన శరీరం ప్రశాంతతను, ఓజస్సును వెలువరిస్తున్నది. గమనించిన బందిపోటులో ఆశ్చర్యం మొదలైంది. ఇలాంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎన్నడూ తను చూసి ఉండలేదు. అయినా తన ఆలోచనల్ని ముఖంలోకి రానివ్వకుండా కరుకుగా అన్నాడు "ఈ చంగాను మించిన వీరుడు ఈ ప్రాంతంలోనే లేడు. పిరికితనం గురించి నాతో మాట్లాడకు. దమ్ముంటే నా ధైర్యానికి ఏదైనా పరీక్షపెట్టు చూద్దాం!" అని.
బుద్ధుడు నిర్భయంగా, ప్రశాంత కరుణతో అన్నాడు - "తలలు నరికెయ్యటం అనేది ధైర్యవంతులు చేసే పనికాదు. అదిగో, ఆ రావి చెట్టు ఆకు ఒకటి కోసుకొనిరా" అని. బందిపోటు కోసుకొచ్చాడు. "సరే, ఇప్పుడు వెళ్లి, ఈ ఆకును దాని స్థానంలోనే తిరిగి చెట్టుకు అతికించు" ఆదేశించాడు బుద్ధుడు.
"అది వీలవదు" అన్నాడు చంగా, కలవరపడుతూ. ఇదంతా ఎటు పోతున్నదో అతనికి అర్థం కాలేదు.
"అవునుమరి" అంటూ చెప్పాడు బుద్ధుడు -"దేన్నైనా విరగగొట్టడం సులభం, కలపటం కంటే. అందుకనే పిరికివాళ్లు చంపుతారు, బాధపెడతారు, వైరుధ్యాలను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో వారికి తెలీకుండానే వారు తమలో బాధను, దు:ఖాన్ని నింపుకుంటారు. శౌర్యవంతులు, దీనికి భిన్నంగా ఉంటారు. వారు సరిచేస్తారు, నయం చేస్తారు, సమస్యల్ని పరిష్కరిస్తారు, సుఖశాంతులందిస్తారు. ప్రతిఫలంగా వాళ్లకూ సుఖశాంతులు లభిస్తాయి. వాళ్లు గనక సత్యాన్ని నిజంగా గ్రహిస్తే, తమ మనస్సును, శరీరాన్ని నిజాయితీతో గమనిస్తే, జన్మ, మృత్యు, జరా, రోగ చక్రం నుండి విముక్తులవ్వగలరు".
ఒకసారి ఇదంతా చెప్పేశాక, బుద్ధుడు యధాప్రకారం నిర్మలంగా నడుచుకొని ముందుకు వెళ్లిపోయాడు.
చంగాలో సంచలనం రేగింది. వదులైన నడుమునుండి పటకాకత్తి జారికింద పడింది. ఒక్క క్షణం సంకోచంగా ఆగిన పిమ్మట, అతను బుద్ధుని వెనక, అదే మార్గంలో నడక సాగించాడు. బుద్ధుని శిష్యుడై, కాల క్రమంలో పరిశుద్ధ మనస్కుడైనాడు. 
 మూలం: పర్తాప్ అగర్వాల్