భైషజ్యగురు బుద్ధుడు
భైషజ్యగురు (Bhaisajyaguru), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు భైషజ్యగురు వైడూర్య ప్రభుడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ఔషద బుద్ధుడు అని మరోక పేరు ఉంది. జపాన్ లో ఈ బుద్ధుని యకూషి అని అంటారు.ఈ బుద్ధుని లోకము వైడూర్య నిర్భాసము.
మంత్రములు
బైషజ్యగురు బుద్ధుని మంత్రాన్ని నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును ఔషద బుద్ధుడు ధారణీ అని అంటారు. ఆ మంత్రము:- ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ
- తద్యథా: ఓం
- భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా
- తద్యథా: ఓం
- భైషజ్యే భైషజ్యే మహాభైషజ్యే భైషజజ్యే రాజసముద్గతే స్వాహా
షింగోన్ బైద్ధములో కింది మంత్రాన్ని ప్రయోగిస్తారు
- ఓం హురు హురు చండాళి మాతంగి స్వాహా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి