18, జనవరి 2013, శుక్రవారం

మహాయాన బుద్ధుడు

మహావైరోచన బుద్ధుడు


మహాహావైరోచనుడు లేదా మహావైరోచన బుద్ధుడు మహాయాన బౌద్ధములో పూజించబడే ఐదు ధ్యాని బుద్ధులలో ఒకరు. మహావైరోచన బుద్ధుడు ఒక ధర్మకాయ బుద్ధుడు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని బమియాన్‌లో తాలిబాన్‌లు ధ్వంసం చేసిన బౌద్ధ విగ్రహాలలో ఒకటి మహావైరోచన బుద్ధుని విగ్రహము.
మహావైరోచన బుద్ధుడు
వైరోచన అనే పదానికి తేజస్ అని అర్ధం. అందుకే మహావరోచన బుద్ధుడు అనే పదాలకు తేజస్మయమైన బుద్ధుడు అని అర్ధము. మహావైరోచన బుద్ధుని గురించిన వివరాలు మహావైరోచన సూత్రములో ఉన్నవి. అమోఘ కల్పరాజ సూత్రములో కూడా మహావైరోచుని గురించి చెప్పబడింది. షింగోన్ బౌద్ధములో ఇతన్ని మహావైరోచన తధాగతుడు అని అంటారు. వజ్రయాన బౌద్ధముని ఇతనే వజ్రసత్త్వునికి ఉపదేశించాడు.
మహావైరోచన బుద్ధ విగ్రహము
మహావైరోచన బుద్ధుని రంగు శ్వేతము, ఆసనము పద్మాసనము, చిహ్నము సువర్ణ చక్రము లేదా సూర్య చక్రము, ముద్రము ధర్మచక్రము

మంత్రము

మహావైరోచన బుద్ధుని మూల మంత్రము ఓం వైరోచన హూం.
షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి జ్వాల మంత్రము అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము అమోఘపాశాకల్పరాజ సూత్రము అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము:
ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం
మహావైరోచనుని బీజాక్షరము 'అ'.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి